తనిఖీల పేరుతో అమెరికాలో జరుగుతున్న తంతు ఇన్నాళ్లు వలసదారులకు తిప్పలు పెట్టగా... తాజాగా ఆ నిబంధనలు దేశ పౌరులను, ప్రముఖులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ కుమారుడు మహమ్మద్ అలీ జూనియర్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన కూడా ఆయన తన తల్లితో కలిసి ఫోర్ట్ లాడర్‌డేల్ హాలీవుడ్ ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లినప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై కాంగ్రెస్ సబ్‌కమిటీతో మాట్లాడేందుకు వచ్చిన మహమ్మద్ అలీ జూనియర్‌ను వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో అధికారులు మరోమారు అదుపులోకి తీసుకున్నారు. ఈ సారి అలీ జూనియర్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు చూపించారు. దీంతో అధికారులు కేవలం 20 నిమిషాల్లోనే అలీని వదిలేసినట్టు ఆయన లాయర్ తెలిపారు. ముస్లిం పేరు ఉందని అలీ జూనియర్ నిర్బంధంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ఈ పరిణామంపై జూనియర్ అలీ స్పందిస్తూ తనిఖీల పేరుతో ఇబ్బందుల పాలు చేయడం విదేశీయులతో సహా అమెరికన్లను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. తనకు గతంలో జరిగిన ఇబ్బందిని పరిష్కరించుకునేందుకు వాషింగ్టన్ నుంచి ఫ్లోరీడా వెళ్లేందుకు విమానం ఎక్కబోతుండగా అధికారులు ప్రశ్నలు గుప్పించారని తెలిపారు. ఇది తనను షాక్‌కు గురిచేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నిబంధలు పౌరులకు మేలు చేసే విధంగా ఉండాలే తప్ప అనవసర ఇబ్బందులకు కారణంగా మారవద్దని జూనియర్ అలీ ఒకింత ఘాటుగానే సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/