ముఖేశ్ ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్‌!

Update: 2017-07-11 05:07 GMT
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్... దేశంలోనే అత్య‌ధిక నెట్ వ‌ర్త్ ఉన్న సంస్థ‌. అంతేనా ఆ సంస్థ అధిప‌తిగా ముఖేశ్ అంబానీ... దేశంలోనే అప‌ర కుబేరుడిగా పేరు గ‌డించారు. ఏటికేడు త‌న సంపాద‌న‌ను, నిక‌ర ఆస్తుల‌ను పెంచుకుంటూ పోతున్న ముఖేశ్ ఏం చేసినా... సంచ‌ల‌న‌మే. ఇప్పుడు ముఖేశ్ అంబానీకి చెందిన వంద‌ల కోట్ల విలువ చేసే అత్యంత విలాస‌వంతమైన భవంతిలో చోటుచేసుకున్న అగ్ని ప్ర‌మాదం కూడా దేశంలో పెద్ద సంచ‌ల‌నంగానే మారింది. ద‌క్షిణ ముంబైలోని ఆల్టా మౌంట్ రోడ్డులో త‌నతో పాటు త‌న‌ భార్య నీతా అంబానీ అభిరుచుల‌కు అనుగుణంగా వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన ముఖేశ్ *అంటీలియా* పేరిట అత్యంత విలాస‌వంత‌మైన భ‌వంతిని క‌ట్టుకున్నారు. ముఖేశ్ దంపతులు, వారి ముగ్గురు పిల్ల‌లు మాత్ర‌మే ఆ 12 అంత‌స్తుల భ‌వంతిలో నివాసం ఉంటున్నారు.

ఈ భ‌వంతిలో కింది ఆరు ఫ్లోర్లు కేవ‌లం పార్కింగ్ కోస‌మే వినియోగిస్తున్నార‌ట‌. ఈ భ‌వంతి నిర్మాణ స‌మ‌యంలోనే జాతీయ మీడియానే కాకుండా అంత‌ర్జాతీయ మీడియాను కూడా అమితంగా ఆక‌ర్షించింది. వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టినా... అతి త‌క్కువ కాలంలోనే నిర్మాణాన్ని పూర్తి చేసిన ముఖేశ్... అట్ట‌హాసంగా గృహం ప్ర‌వేశం చేశారు. భూలోకంలో విలాసానికి కేరాఫ్ అడ్రెస్‌ గా నాడు వార్త‌ల్లో నిలిచిన ఈ భవంతి... ఇప్పుడు మ‌రో కార‌ణంతో మ‌రోమారు వార్త‌ల్లోకెక్కింది. ఆ వివరాల్లోకెళితే... అంటీలియా భవంతిలో నిన్న రాత్రి ఒక్క‌సారిగా ఎగిరిప‌డ్డ అగ్ని కీల‌లు ముంబై వాసుల‌కు షాకిచ్చాయి. ముఖేశ్ అంబానీకి చెందిన భవంతిలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. భవంతిలోని ఆరో అంత‌స్తులో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదం కార‌ణంగా అగ్ని కీల‌లు ఎగ‌సిప‌డ్డాయి.

ఎంతైనా అప‌ర కుబేరుడి భవంతి క‌దా... విష‌యం తెలిసిన వెంట‌నే అటు అగ్నిమాప‌క శాఖ‌తో పాటు పోలీసులు కూడా క్ష‌ణాల్లో రంగంలోకి దిగిపోయారు. అధికారుల క్విక్ రియాక్ష‌న్‌ తో కాసేప‌ట్లోనే మంట‌లు అదుపులోకి రాగా... ముఖేశ్ కుటుంబం కూడా ఊపికి పీల్చుకుంది. ఆరో అంత‌స్తులోని గార్డెన్ లో జ‌రిగిన ప్ర‌మాదం కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయని, అక్క‌డికి స‌మీపంలోనే మొబైల్ ట‌వ‌ర్ కూడా ఉంద‌ని, అయితే క్ష‌ణాల్లో స్పందించిన అధికారుల కార‌ణంగా పెద్ద న‌ష్ట‌మేమీ సంభ‌వించ‌లేద‌ని రిల‌యన్స్ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు గానీ, ఈ ప్ర‌మాదం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టం వివ‌రాలు గానీ వెల్లడించేందుకు వారు నిరాక‌రించారు.
Tags:    

Similar News