ముఖేశ్ అంబానీ మామూలోడా? ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ టెన్ లో ఒకడు. అలాంటోడు వ్యవస్థల్ని సైతం శాసించేస్తుంటారు. అలాంటి ముఖేశ్ అంబానీ తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కమ్ హోం మంత్రి అమిత్ షాను భారీగా పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పటివరకూ అమిత్ షాలో ఎవరికి కనిపించినన్నియాంగిల్స్ ముఖేశ్ అంబానీకి కనిపించటమే కాదు.. వాటిని అశేష ప్రజానీకానికి తెలిసేలా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గాంధీనగర్ లోని పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీలో జరుగుతున్న స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ముఖేశ్ మాట్లాడుతూ.. అమిత్ భాయ్ లాంటి గొప్పనాయకుడు లభించినందుకు గుజరాత్ తో పాటు యావత్ దేశం ఎంతో గర్వపడుతోందన్నారు.
అమిత్ షా నిజమైన కర్మయోగి అని.. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూ సరికొత్త బిరుదులు ఇచ్చేశారు. దేశం సురక్షితంగా ఉందా? అన్న అంశంపై మాట్లాడిన ముఖేశ్.. పెద్ద కలల్ని కనటానికి ఆలోచించొద్దన్నారు. లక్ష్యాల్ని ఎప్పుడూ తగ్గించుకోవద్దన్నారు. అందరి కలలు నెరవేరుతాయని.. రానున్న రోజుల్లో భారత్ లో ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు.
అంబానీ మాట్లాడిన తర్వాత మాట్లాడిన అమిత్ షా.. దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేసేందుకు 2014 వరకూ ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తాము గడిచిన ఐదేళ్లలో తయారు చేసినట్లుగా చెప్పుకున్నారు. అంబానీ లాంటి అపర కుబేరుడు అంతగా పొగిడిన తర్వాత.. తమ పాలనపై అమిత్ షా లాంటోళ్లు ఆ మాత్రం గొప్పగా చెప్పుకోకుండా ఉంటారా? మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఇంత భారీగా అమిత్ షాను పొగిడేసిన వైనానికి ముఖేశ్ అంబానీకి ఏమిచ్చినా తక్కువే అవుతుందేమో?