దేశంలోని ఏ భారతీయుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని అతి కొద్దిమందిలో ముకేశ్ అంబానీ ఒకరు. రోడ్డు కనెక్టెవిటీ లేని గ్రామాలు దేశంలో చాలానే ఉంటాయి. కానీ.. అంబానీ పేరు తెలీని ప్రజలు మాత్రం ఉండరని చెప్పొచ్చు. అలాంటి ముకేశ్ అంబానీ ఆస్తి విలువ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే మిన్నంగా అంబానీ వ్యక్తిగత ఆస్తుల విలువ ఉండటం విశేషం.
తాజాగా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురన్ ఇండియా రిచ్ లిస్ట్ లో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన తాజా ఆస్తి విలువ ఏకంగా రూ.3,80,700 కోట్లు. ఆసక్తికరమైన విషయం ఏమంటే రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ అంబానీ ఆస్తి విలువ కంటే తక్కువగా ఉండటం. ఈ ఏడాది సవరించిన రెండు తెలుగు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కేవలం రూ.3,74,518 కోట్లు మాత్రమే.
దేశంలో రూ.వెయ్యి కోట్ల నెట్ వర్త్ ఉండే వారికి సంబంధించిన జాబితాను ఈ సంస్థ తయారు చేస్తుంటుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలను నిర్వహిస్తున్న వారితో పాటు.. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా వ్యాపార కార్యకలాపాల్ని సాగిస్తున్న వారి జాబితాను తయారు చేసింది. అంబానీ తర్వాత అత్యధిక ఆస్తిపరుడుగా లండన్ కు చెందిన ఎస్ పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వారి ఆస్తి విలువ రూ.1,86,500 కోట్లు. మూడోస్థానంలో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్ జీ (రూ.1,17,100 కోట్లు), నాలుగో స్థానంలో అర్సెలార్ మిట్టల్ ఛైర్మన్ కమ్ సీఈవో ఎల్ ఎన్ మిట్టల్ (రూ,1,07,300 కోట్లు).. ఐదో స్థానంలో గౌతమ్ ఆదానీ (రూ.94,500 కోట్లు) ఉన్నారు.
టాప్ టెన్ లో మిగిలిన ఐదు స్థానాల విషయానికి వస్తే..
6. కొటక్ మహీంద్రా బ్యాంక్ అధిపతి ఉదయ్ కోటక్ రూ.94,100 కోట్లు
7. సైరస్ మిస్త్రీ రూ.88,800 కోట్లు
8. సైరస్ పల్లోంజీ మిస్త్రీ రూ.76,800 కోట్లు
9. షాపూర్జీ పల్లోంజీ రూ.76,800 కోట్లు
10. దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా వ్యవస్థాపకుడు) రూ.71,500 కోట్లు
సదరు సంస్థ అధ్యయనం ప్రకారం గత ఏడాది (2018లో) వెయ్యి కోట్లకు పైనే ఆస్తిపరులు 831 మంది ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 953కు పెరగటం గమనార్హం. ఈ లిస్ట్ లో ఉన్న టాప్ 25 మంది మొత్తం ఆస్తి విలువను కలిపితే దేశ జీడీపీలో 10 శాతానికి సమానం. గత ఏడాదితో పోలిస్తే ఈ జాబితాలోని వారందరి ఉమ్మడి సంపద 2 శాతం పెరిగితే.. సరాసరి సంపద మాత్రం 11 శాతం తగ్గినట్లుగా గుర్తించారు.
ఈ జాబితాలో చోటు చిక్కించుకున్న సంపన్న భారతీయుల్లో అత్యధికులు ముంబయిలో నివాసం ఉండేవారే. జాబితాలోని మొత్తం సంపన్నుల్లో 246 మంది ముంబయిలో ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 175 మంది.. బెంగళూరులో 77 మంది నివసిస్తున్నారు. ప్రవాసభారతీయులు 82 మంది ఉన్నారు. వారిలో 31 మంది అమెరికాలో ఉంటుంటే.. మిగిలిన వారు యూఏఈ.. యూకేలో ఉంటున్నారు.
ఈ జాబితాలోని సంపన్నుల్లో అత్యంత పిన్న వయస్కుడు ఓయో రూమ్స్ వ్యవస్థాపక సీఈవో రితేష్ అగర్వాల్ నిలిచారు. ఆయన వయసు కేవలం పాతికేళ్లు మాత్రమే. ఆయన సంపద విలువ రూ.7500 కోట్లు. ఇక.. 40 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్న వారిలో మీడియా డాట్ నెట్ కు చెందిన దివ్యాంక్ తురకియా అత్యంత సంపన్నుడిగా నిలిచారు. జాబితాలో 152 మంది మహిళలకు చోటు లభించింది. వీరి సగటు వయసు 52 ఏళ్లు. మహిళల్లో టాపర్ గా హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కు చెందిన రోష్ఠి నాడార్ నిలిచారు. తాజా జాబితాలో ఆమె 19వ స్థానంలో నిలిచారు. ఆమె సంపద విలువ రూ.36,800 కోట్లుగా ఉంది. ఆమెకు 37 ఏళ్లు మాత్రమే. చాలామంది హేతువాదులు నమ్మని మరో విషయం ఉంది. ఈ అపర కుబేరుల్లో అత్యధికులు కర్కాటం.. కన్య.. మేషం.. సింహం.. వశ్చిక రాశులకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.