హైజాక్ భ‌యం..ఎయిర్‌ పోర్ట్‌ ల‌లో హై అల‌ర్ట్‌

Update: 2017-04-16 09:04 GMT
దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన అంత‌ర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌ ల‌లో హైఅలర్ట్ ప్ర‌క‌టించారు. హైజాక్ బెదిరింపులు రావ‌డంతో ముంబై - చెన్నై - హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌ పోర్ట్‌ ల‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. నేష‌న‌ల్ సెక్యూరిటీ గార్డ్స్ యాంటీ హైజాక్ డ్రిల్స్ మొద‌లుపెట్టారు. నిన్న ముంబైలోని ఓ సీనియ‌ర్ పోలీస్ అధికారికి ఓ మ‌హిళ అల‌ర్ట్ మెయిల్ పంప‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ మూడు ఎయిర్‌ పోర్ట్‌ ల‌లోనూ విమానాల‌ను హైజాక్ చేయ‌డానికి ఆరుగురు వ్య‌క్తులు ప్లాన్ చేస్తుండ‌గా తాను విన్నాన‌ని ఆ మ‌హిళ మెయిల్‌ లో వెల్ల‌డించింది.

ఈ ప‌రిణామంతో దేశంలోని ఎయిర్‌ పోర్ట్‌ ల‌కు రక్ష‌ణ క‌ల్పించే సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌ ను ముంబై పోలీసులు అప్ర‌మ‌త్తం చేశారు. కౌంట‌ర్ టెర్ర‌రిజం టీమ్స్‌ ను మోహరించారు. ఎయిర్‌ పోర్ట్ పార్కింగ్‌ - ఎంట్రీ గేట్స్ ద‌గ్గ‌ర భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. సీఐఎస్ ఎఫ్ స్నిఫ‌ర్ డాగ్ స్క్వాడ్స్‌ తో సానిటేష‌న్ డ్రిల్స్ నిర్వ‌హించింది. అన్ని ప్రైవేట్ ఎయిర్‌ లైన్స్‌ ను మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ప్ర‌యాణికులంతా సిబ్బందికి స‌హ‌కరించాల‌ని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News