ఒక కసాయికి భారీ శిక్షను విధిస్తూ బాంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచ్ సంచలన తీర్పును ఇచ్చింది. రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసిన ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇందుకు భారీ శిక్ష విధించింది.
21 ఏళ్ల మస్ రామ్ అనే కసాయి.. తన రెండున్నరేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి అంతమొందించాడు. ఈ దారుణ ఘటనలో నిందితుడిగా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని.. కోర్టుకు హాజరుపర్చారు. ఇతగాడి దుర్మార్గం కోర్టులో సాక్ష్యాలతో నిరూపితం కావటంతో నాగపూర్ బెంచ్ సంచలన శిక్షను విధించారు.
2013 ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఘటనపై తుది తీర్పునిచ్చిన కోర్టు.. ఇంతటి దారుణానికి పాల్పడిన కసాయిని రెండుసార్లు ఉరి తీసి.. రెండు సార్లు ‘లైఫ్’ పనిష్మెంట్ వేస్తూ తీర్పునిచ్చింది. ఒక కేసు విషయంలో రెండు సార్లు ఉరి.. రెండు సార్లు లైఫ్ పనిష్మెంట్ ఇవ్వాలంటూ తీర్పు ఇవ్వటం అరుదైన వ్యవహారంగా చెబుతున్నారు.