సెక్స్‌ వర్క్‌ నేరం కాదు: బాంబే సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు!

Update: 2023-05-23 17:00 GMT
పబ్లిక్‌ లో సెక్స్‌ చేస్తేనే నేరమని.. లేకపోతే నేరం కాదని బాంబే సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒక ఇంటిలో సెక్స్‌ చేస్తుండగా పోలీసులు రైడ్‌ విటులతోపాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళను ఏడాదిపాటు ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌ లో ఉంచాలని.. ఆమెను బయటకు రాకుండా చూడాలని స్థానిక మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బాంబే సెషన్స్‌ కోర్టు తప్పుబట్టింది. తనను ఏడాది పాటు ప్రభుత్వ షెల్టర్‌ హోంలో నిర్బంధించాలని మేజిస్ట్రేట్‌ కోర్టు చేసిన ఉత్తర్వులపై ఆ మహిళ బాంబే సెషన్స్‌ కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన బాంబే సెషన్స్‌ కోర్టు ఆ మహిళను షెల్టర్‌ హోమ్‌ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఆమెను బయటకు రానీయకుండా చేయడటం, ఎక్కడకి తిరగనీయకుండా చేయడం ప్రాథమిక హక్కులను హరించడం కిందకే వస్తుందని బాంబే సెషన్స్‌ కోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఆమెను ప్రభుత్వ షెల్టర్‌ హోంలో బంధించకుండా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్‌ లో చేస్తేనే సెక్స్‌ నేరమని బాంబే సెషన్స్‌ కోర్టు తెలిపింది. నిబంధనల ప్రకారం సెక్స్‌ వర్క్‌ చేయడం తప్పు కాదని పేర్కొంది. ఈ మేరకు మేజిస్ట్రేట్‌ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేస్తూ బాంబే సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ షెల్టర్‌ హోంలో ఉంచిన 34 ఏళ్లను మహిళను స్వేచ్ఛగా విడుదల చేయాలని బాంబే సెషన్స్‌ కోర్టు ఆదేశించింది.

ఈ ఏడాది మార్చి 15న మేజిస్ట్రేట్‌ కోర్టు తనను ముంబయిలోని షెల్టర్‌ హోమ్‌లో ఏడాది పాటు నిర్బంధించి సంరక్షణ, రక్షణ, ఆశ్రయం కల్పించాలని ఆదేశించడంతో ఆ మహిళ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించింది.

అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి సివి పాటిల్‌ గత నెలలో మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఇటీవల అందుబాటులోకి వచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంబేలోని సబర్బన్‌ ములుండ్‌ లోని వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత, నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ఆమెతో పాటు మరో ఇద్దరిని మజ్‌గావ్‌ లోని మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు.

మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలపై మహిళ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించగా.. 'నిబంధన ప్రకారం, సెక్స్‌ వర్క్‌లో పాల్గొనడం నేరం కాదు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో లైంగిక పనిని నేరంగా పరిగణించవచ్చు' అని సెషన్స్‌ కోర్టు పేర్కొంది. అంతేకాకుండా, ఆ మహిళ పబ్లిక్‌ లో శృంగారం చేయలేదని తెలిపింది.

Similar News