ముంబయి పోలీసులకు షాక్ గా మహిళ ఫిర్యాదు

Update: 2017-02-28 09:16 GMT
ఒక మహిళ చేసిన ఫిర్యాదు ముంబయి పోలీసుల్ని షేక్ చేస్తోంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటివరకూ ఎన్నో నేరాలు చూసిన వారికి సైతం.. తాజా వ్యవహారం సరికొత్తగా ఉండటమే కాదు.. ఇలాంటి విషయాల్లో ఏం చేస్తే బాగుంటుందన్నది వారు బుర్ర బద్ధలుకొట్టుకుంటున్నారట. ముంబయి పోలీసుల్ని మహా ఇబ్బందికి గురి చేస్తున్న ఆ ఉదంతం ఏమిటో చూస్తే..

వారిద్దరూ మహిళలు. ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసోళ్లే. చదువుకోలేదా? అంటే.. ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో పాథాలజీ విభాగంలో పని చేసే వారు. ఎలా మొదలైందో కానీ.. ఇద్దరూ కనెక్ట్ అయ్యారు. సహజీవనం మొదలెట్టారు. ఈ ఇద్దరు మహిళల్లో ఒకరికి పెళ్లి కావటం.. భర్తతో పడకపోవటంతో.. భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ.. ఈ మహిళకు క్లోజ్ అయ్యారు. ఇలా ఇద్దరి మధ్య చాలానే కాలం రిలేషన్ షిప్ నడిచింది.

ఉన్నట్లుండి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఎందుకంటే..పోలీసుల్ని ఆశ్రయించిన మహిళ నగ్న చిత్రాల్ని భాగస్వామిగా ఉంటున్న మహిళ తీయటం.. ఈ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగాయి. ఈ గొడవ తర్వాత.. ఫిర్యాదు చేసిన మహిళ నగ్న చిత్రాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం.. తన వాట్సప్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవటం లాంటివి చేయటం.. ఆ విషయాల్ని తెలుసుకున్న బాధితురాలు ముంబయి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని అధికారులు.. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ.. తనకీ విషయంలో ఎలాంటి సంబంధం లేదని.. తాను నేరమే చేయలేదని వాదిస్తోంది. ఇద్దరి వాదనల నేపథ్యంలో కోర్టు రియాక్ట్ అవుతూ.. నిందితురాలిని కస్టడీలోకితీసుకున్నారు. ఆమెకు బెయిల్ ఇవ్వటానికి కోర్టు నో చెప్పింది. ఈ వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News