ఒక్కనియోజకవర్గం.. ఒకే ఒక్క నియోజకవర్గం.. అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను కుదిపేస్తోంది. వాస్తవానికి ఇది సిట్టింగ్ నియోజకవర్గం కూడా కాదు. అయినప్పటికీ.. టీఆర్ ఎస్‌కు మాత్రం ఈ నియోజకవర్గం ప్రాణానిక న్నా ఎక్కువగా మారిపోయింది. మనుటయా.. మరణించుటయా! అన్నట్టుగా.. కేసీఆర్ నాయకత్వానికి.. ఆయన పాలనకు కూడా మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు అగ్నిపరీక్షగా మారిందనే వాదన వినిపిస్తోం ది. ఇక్కడ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు.
అయినప్పటికీ.. పోరు మాత్రం హోరా హోరీగా సాగుతోంది. మేమంటే మేమే అన్నట్టుగా.. పార్టీలు ఇక్కడ ప్రచారానికి దిగాయి. అదేసమయంలో పార్టీల్లోకి ఇతర పార్టీల నేతలను చేర్చుకునే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాయి.
ఈ క్రమంలో తాయిలాలు కూడాబాగానే ముట్టచెబుతున్నాయి. సరే.. మిగిలిన కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉన్నా.. వాటికి ఇబ్బంది లేదు. బీజేపీ ఓడినా.. "ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం .. కాబట్టి.. దీని నుంచి మరింత రాటుదేలతాం" అని చెప్పుకొనే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ఓడిపోయినా.. సిట్టింగ్ సీటు కోల్పోయామనే ఆవేదన ఉన్నప్పటికీ.. పరిస్థితిని పునఃపరిశీలించు కుని అడుగులు వేస్తామని చెప్పుకొనేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ, టీఆర్ ఎస్ ఓటమి చెందితే?! ఇదే ఇప్పుడు అధికార పార్టీలో గుబులు రేపుతున్న విషయం. ఎందుకంటే.. టీఆర్ ఎస్ దాదాపు 7 ఏళ్లుగా అధి కారంలో ఉంది. ఈ ఏడేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నామని.. సీఎం కేసీఆర్ చెబుతున్నారు. నిధులు-నీళ్లు ప్రజలకు, రైతులకుసంపూర్ణంగా అందిస్తున్నామని అంటున్నారు.
అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర సెంటిమెంటును కూడా ఆయన ఎప్పటికప్పుడు రాజేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మి, దళిత బంధు ఇలా.. సంచలనాత్మక పథకాలు ప్రవేశ పెట్టామనిపదేపదే చెబుతున్నారు. మరి ఇన్నిచేస్తున్నప్పుడు.. టీఆర్ ఎస్‌కే ప్రజలు పట్టం కట్టాలి.
ఈ నేపథ్యంలో ఎక్కడైనా చిన్న పొరపాటు దొర్లినా.. పార్టీ పరువు పోవడంతోపాటు.. సీఎం కేసీఆర్ పాలనపైనా.. మరకలు పడే అవకాశం ఉందనేది అధికార పార్టీలో జరుగుతున్నకీలక చర్చ. ఈ నేపథ్యంలో సర్వశక్తులు ఒడ్డి అయినా.. ఇక్కడ గెలుపు గుర్రం.. వచ్చే సార్వత్రిక సమరంలో సత్తా చాటాలనేది కేసీఆర్ ప్లాన్. మరి ఏమేరకు విజయం దక్కించుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.