ఒక వ్యక్తిపై చంపేంత కోపం ఉంటే గన్ తో షూట్ చేస్తారు.. లేకపోతే కత్తితో పొడిచేస్తారు. అదీ కాకుంటే యాక్సిడెంట్ చేసి చంపేస్తారు.. వారి పగను అలా తీర్చుకుంటారు. కానీ బట్టలన్నీ ఊడదీసి చేతులు కట్టేసి శరీరాన్ని గోళ్లతో రక్కేసి.. తల - మొండాన్ని కత్తితో కరకరా కోసేసి వేరుచేసేంత కోపం ఉంటుందా.? సిరియాలోని ఐసీస్ లాంటి క్రూర ఉగ్రవాదులకు ఇలాంటి స్వభావం ఉంటుంది. కానీ ఇక్కడో హత్య కూడా అలానే జరిగింది. అంతకుమించిన క్రూరత్వం బయటపడింది. మన దగ్గర అంతటి క్రూరత్వం నిండిన మనుషులున్నారా అని తెలిసి అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలు - సీరియళ్లు జనాలపై మాములు ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా క్రైం - హర్రర్ ప్రోగ్రాంలు చూసి క్రైం చేసినా దొరక్కకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంటున్నారు.. క్షణికావేశాలకే ప్రాణాలు తీస్తున్నారు. కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎలా చంపాలో యూట్యూబ్ లు - సీరియళ్లు చూసి నేర్చుకుంటున్నారు. ప్రధానంగా వివాహేతర - ప్రేమ సంబంధాలే హత్యలకు 80శాతం కారణమవుతున్నాయి. ఇక భూ వివాదాలు కూడా 20 శాతం వరకూ హత్యలను ప్రోత్సహిస్తున్నాయి.
తాజాగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా-కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని గంభీరావుపేట మండలం గోరంటాల శివారు పెద్దమ్మ అడవుల్లో మంగళవారం ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య పథకం ప్రకారం చేసినట్లుగానే పోలీసులు భావిస్తున్నారు. ఏ ప్రాంతంలోనో చంపి పెద్దమ్మ అడవుల్లోకి యువకుడిని తీసుకొచ్చి పడేశారు. 35 ఏళ్ల వయసున్న ఈ యువకుడు కామారెడ్డి జిల్లా వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చేతులు కట్టేసి.. చిత్రహింసలు పెట్టి దుండగులు తల - మొండాన్ని వేరుచేసి అతి కిరాతకంగా విడదీసి చంపేశారు. హత్య చేసిన తర్వాత మృతుడి ఆనవాళ్లు ఏవీ లభించకుండా తలను మాయం చేశారు. ఒంటిపై బట్టలు తీసేశారు. ఆ తర్వాత వేలిముద్రలు పడకుండా జాగ్రత్తగా చంపేశారు. పక్కా ప్రీ ప్లాన్ డ్ హత్య చూసి పోలీసులు కూడా నోరెళ్లబెట్టారు.
హత్యకేసును చేధించేందుకు జాగీలాలతో వెతికినా ఆచూకీ లభించలేదు. మృతుడి వేళ్లను ఆధార్ కేంద్రంలోకి తీసుకెళ్లి సరిచూస్తే అతడి చిరునామా తెలిసి ఎవరు హత్యకు గురయ్యారో తెలుస్తుందని పోలీసులు తెలిపారు. ఒక్క క్లూ కూడా దొరకకుండా పక్కా ప్రీ ప్లాన్ డ్ గా చేసిన ఈ మర్డర్ పోలీసులకు సవాల్ విసురుతోంది. అయితే సినిమాలు - సీరియల్స్ చూసే ఇలా పక్కగా హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. మిస్సైన యువకుల కోసం ఆరాతీస్తున్నారు.