ప్రియురాల్ని దారుణంగా చంపిన వైజాగ్ ప్రియుడు

Update: 2017-07-08 15:31 GMT
నేరాలు జ‌ర‌గ‌టం మామూలే. కానీ.. కొన్ని నేరాలు జ‌రిగిన తీరు సంచ‌ల‌నంగా మార‌తాయి. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం కూడా అలాంటిది. ప్రియురాల్ని అత్యంత దారుణంగా.. కిరాత‌కంగా చంపిన వైనం తాజాగా చోటు చేసుకుంది. విశాఖ‌లోని పూర్ణా మార్కెట్ స‌మీపంలో జ‌రిగిన ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాన్ని సృష్టిస్తోంది.

పూర్ణా మార్కెట్ స‌మీపంలోని రంగిరీజు వీధిలో బి భ‌వాని ఉంటుంది. ఆమెకు.. అక్క‌డి ద‌గ్గ‌ర్లోని పండా వీధికి చెందిన బి స‌తీష్ కుమార్ అనే యువ‌కుడితో మూడేళ్లుగా ప‌రిచ‌యం ఉంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఇరువురు ఒక‌రింటికి మ‌రొక‌రు వచ్చి పోతుంటారు. ఇదిలా ఉండ‌గా.. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట వేళ‌లో మాట్లాడ‌టానికి భ‌వానిని ఇంటికి రావాలంటూ స‌తీష్ కోరాడు.

స‌తీష్ ఇంటికి వెళ్లిన రెండు గంట‌ల త‌ర్వాత భ‌వానీని అత్యంత దారుణంగా హ‌త‌మార్చ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఇంట్లోని కబ్ బోర్డ్ అద్దం ప‌గ‌ల‌గొట్టి దాంతో భ‌వానీ గొంతును కోసేశాడు. త‌న‌పైకి దాడి చేస్తున్న భ‌య‌ప‌డిపోయిన భ‌వానీ పెద్ద పెద్ద‌గా అరుపులు వేసింది. దీంతో.. అక్క‌డి స్థానికులు స‌తీష్ ను ఆపే ప్ర‌య‌త్నం చేశారు.

దీంతో.. వారి మీదా దాడి చేస్తాన‌ని బెదిరించిన స‌తీష్‌..భ‌వానీ గొంతు కోసేయ‌ట‌మే కాదు.. ఆమె మీద డంబెల్ తో ప‌దే ప‌దే త‌ల మీద మోదాడు. ఆపై చ‌నిపోయిన ఆమె మృత‌దేహాన్ని మెట్ల మీద నుంచి కింద‌కు ఈడ్చుకొచ్చాడు.
దీంతో అక్క‌డిస్థానికులు అత‌డి మీద‌కు దాడి చేశారు. అత‌ని కిరాత‌కాన్ని పోలీసుల‌కు స‌మాచారం అందించిన వారు.. పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్రేమ వ్య‌వ‌హారానికి సంబంధించిన వైన‌మే తాజా నేరానికి కార‌ణంగా బావిస్తున్నారు. అత్యంత కిరాత‌కంగా ప్రియురాల్ని హ‌త‌మార్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News