ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు చెందిన పవర్ ఫుల్ యుద్ధనౌక ముణిగిపోవటంలో అగ్రరాజ్యం అమెరికా హస్తముందా ? అవుననే బయటపడిన సమాచారం కలకలం సృష్టిస్తోంది. యుద్ధం మొదలైన దగ్గర నుండి ఉక్రెయిన్ కు అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు ఆయుధాలు, ఆర్ధికంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ దేశంకూడా తమ సైన్యాన్ని ప్రత్యక్షంగా ఉక్రెయిన్ కు పంపలేదు.
అయితే తమ దగ్గరున్న అధునాతన ఆయుధాలను ఉక్రెయిన్ కు చేరవేస్తున్నాయి. నాటో, యూరప్ దేశాల మద్దతున్న కారణంగానే ఉక్రెయిన్, రష్యా సైన్యాన్ని రెండు నెలలుగా ఎదిరించగలుగుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే రష్యాకు చెందిన మస్క్ వా అనే యుద్ధనౌక ఈనెల 14వ తేదీన నల్ల సముద్రంలో మునిగిపోయింది. మస్క్ వా అంటే రష్యా నేవీలో అత్యంత బలమైన, ఆధునికమైన ఆయుధమనే చెప్పాలి.
ఇలాంటి యుద్ధ నౌకను ఉక్రెయిన్ సైన్యం నల్ల సముద్రంలో ధ్వంసం చేసిందంటే ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే మస్క్ వా ను దెబ్బ తీసేంత సీన్ ఉక్రెయిన్ కు లేదు. అయితే ఇదే విషయమై అమెరికా సైన్యాధికారి ఒకరు మాట్లాడుతూ తమ సహకారం వల్లే ఉక్రెయిన్ సైన్యం మస్క్ వా ను ధ్వంసం చేసినట్లు చెప్పటం సంచలనంగా మారింది. ఆ ఆపరేషన్లో అమెరికా ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయలేదని అయితే మస్క్ వా ఎక్కడున్నదనే ఆచూకీని చెప్పింది మాత్రమే తామేనంటు అమెరికా సైన్యాధికారి బయటపెట్టారు.
అమెరికా నిఘా వ్యవస్ధ ఇచ్చిన సమాచారం వల్లే తమ సైన్యం మస్క్ వా ను కూల్చేసిందంటు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే మస్క్ వా కూలిపోవటంలో ఎలాంటి క్షిపణిదాడి కారణంకాదని రష్యా ప్రకటించింది. అంతర్గతంగా తలెత్తిన సాంకేతిక లోపంవల్ల మస్క్ వా లో ప్రమాదం జరిగి ముణిగిపోయిందంటోంది.
రష్యా ప్రకటనను ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే సాంతికేతిక సమస్య వస్తే దాన్ని సరిచేసుకునే అవకాశముంది కానీ ఏకంగా ముణిగిపోదు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక దెబ్బతినటం ఇదే మొదటిసారి.