జులై చివరికి మైలాన్ రెమ్‌డెసివర్ డ్రగ్...ఒక్కో బాటిల్ రూ.4800 !

Update: 2020-07-07 10:00 GMT
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి భారీగా పెరుగుతున్నాయి. వైరస్ కేసుల్లో రష్యాను అధిగమించి మూడో ప్లేస్ ‌లోకి భారత్ ఎగబాకింది. అయితే వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ ను కనిపెట్టే పనిలో పలు ఫార్మా కంపెనీలు చాలా బిజీగా ఉన్నాయి.  ఇందులో ప్రథమంగా వినిపించే పేరుగా గిలీడ్ సైన్సెస్కు  చెందిన రెమ్‌డెసివర్ డ్రగ్. జనరిక్ ఔషధం వినియోగించేందుకు తమకు అనుమతి వచ్చిందని మైలాన్ ఎన్ ‌బీ కంపెనీ తెలిపింది. అన్ని అనుకున్నట్లు జరిగితే  ఈ నెలలోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తాం అని  .. 100 మిల్లీ గ్రాముల బాటిల్ ధర రూ.4800 ఉంటుందని వెల్లడించింది.

స్తుతం దేశంలో వైరస్ సోకినవారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందజేస్తున్నారు. కొన్ని యాంటీ వైరల్ మందులు కూడా ఇస్తున్నారు. అమెరికాలో జరిపిన పరిశోధనల్లో రెడ్ డెసివర్ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నాని తెలింది. భారత్‌ తోపాటు ఇతర దేశాల్లో కూడా గిలీడ్ సైన్సెస్ జనరిగ్ ఔషధంగా విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే దేశంలో మాత్రం అత్యవసరంగా మాత్రమే ఉపయోగిస్తారు. కరోనా వైరస్ నివారణ కోసం ఇప్పటికే సిప్లా లిమిటెడ్ సిప్రెమి, హెటిరో కొవిఫర్ పేరుతో రెడ్ డెసివర్ విక్రయిస్తున్నారు. సిప్రెమీ ధర రూ.5 వేలు కాగా, కొవిఫర్ రూ.5400కు సేల్ చేస్తున్నారు. ఒక్కో దేశంలో ఒకలా రెమ్ డెసివర్ గిలీడ్ వైరస్ నివారణ మందు విక్రయిస్తోంది. దేశంలో డాక్టర్ రెడ్డీస్, జూబిలెంట్, సింజెన్, జైడస్ క్యాడిలాకు కంపెనీ అనుమతులు ఇచ్చింది.
Tags:    

Similar News