జ‌డ దొంగ దొరికాడు కానీ.. అంతా షాక్!

Update: 2017-08-17 06:54 GMT
దేవ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది జ‌డ దొంగ వ్య‌వ‌హారం. నిద్ర పోతున్న మ‌హిళ‌ల జుట్టు క‌ట్ చేస్తున్న వైనం ప‌లు రాష్ట్రాల్లో తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది. ఇదంతా ఎవ‌రు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అన్న‌ది పెద్ద మిస్ట‌రీగా మారింది. ఇంట్లోకి వ‌చ్చి.. కేవ‌లం మ‌హిళ‌ల జుట్టు మాత్ర‌మే క‌ట్ చేస్తున్న ఈ వైనం ప‌లురాష్ట్రాల్లోని మ‌హిళ‌ల‌కు కంటి నిండా నిద్ర లేకుండా ఓయింది. ఎందుకంటే.. ఇంట్లో విలువైన వ‌స్తువులు ఉన్నా.. వాటిని ప‌ట్టించుకోని ఈ జ‌డ దొంగ‌.. జుట్టును క‌సిదీరా క‌ట్ చేయ‌టంపై ప‌లు వాద‌న‌లు వినిపించాయి.

ఇదంతా మంత్ర‌గాళ్ల ప‌ని అని కొంద‌రంటే.. మ‌రికొంద‌రు ఒక వృద్ధుడు త్రిశూలంతో ఈ ప‌ని చేస్తున్న‌ట్లుగా చెప్పారు. మ‌రి కొంద‌రైతే త‌మ ఊహాల‌కు రెక్క‌లు తొడిగేసి.. గ్ర‌హాంత‌ర‌వాసుల ప‌నిగా.. దెయ్యమే ఇదంతా చేస్తుందంటూ క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొచ్చారు. ఈ జుట్టు దొంగ ర‌చ్చ రోజురోజుకి ముదిరిపోవ‌టంతో.. మీడియాలో ఫోక‌స్ పెరిగిపోవటంతో పోలీసుల రంగ‌ప్ర‌వేశం చేశారు. చివ‌ర‌కు ఎన్నోప్ర‌య‌త్నాలు చేసి.. చివ‌ర‌కు జుట్టు దొంగ‌ను ప‌ట్టుకున్నారు. కాకుంటే.. ఆ దొంగ‌ను చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఎందుకంటే.. ఆ జుట్టుదొంగ ఎవ‌రో కాదు.. ఒక పురుగుగా తేల్చారు.

ఢిల్లీ.. గుర్ గావ్‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. ముంబ‌యి త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన ఈ జ‌డ క‌త్తిరింపు ఘ‌ట‌న‌లు ప్ర‌జ‌ల్నిహ‌డ‌లెత్తించాయి. బాధితులు సైతం తాము ఒక వృద్ధుడ్ని చూశామ‌ని.. త్రిశూలంతో వ‌స్తున్నాడ‌ని.. అత‌న్ని చూడ‌గానే స్పృహ త‌ప్పి పోతున్న‌ట్లుగా చెప్పారు. దీంతో ఈ ఉదంతం మ‌రింత గంద‌ర‌గోళానికి తెర తీసింది. కొన్ని చోట్ల అయితే.. ఒక దెయ్య‌మే ఈ ప‌ని చేసింద‌ని.. తాము చూసిన‌ట్లుగా బాధితులు చెప్ప‌టం క‌నిపించింది. ఇలాంటి వేళ‌.. ఈ మిస్ట‌రీని బీహార్ వాసులు చేధించారు. ఇదంతా చే్స్తున్న‌ది ఒక పురుగు అని.. దాన్ని పాట్నాలోని రామ‌కృష్ణ‌న‌గ‌ర్ లో ఒక వింత పురుగు చేస్తుందంటూ ప‌ట్టుకొని మ‌రీ చూపించారు. ఈ పురుగు ముందు జుట్ట‌ను పెడితే.. అది క్ష‌ణాల్లో క‌ట్ చేయ‌టం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఈ పురుగును బంధించిన పోలీసులు.. ఈ ఉదంతంపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు.ఈ పురుగును చూపిస్తూ.. పుకార్ల‌ను న‌మ్మొద్దంటున్నారు. అంతా బాగుంది కానీ.. నాలుగైదు వెంట్రుక‌ల్ని ప‌ర‌ప‌రా కొరికేస్తున్న పురుగు.. అంత పెద్ద జ‌డ‌ను కొరికేస్తుందా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది.
Tags:    

Similar News