కాంగ్రెస్ కు భారీ షాక్.. జనసేనలోకి నాదెండ్ల

Update: 2018-10-11 08:21 GMT
కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏపీలో నానాటికీ కునారిల్లుతున్న పార్టీని ఆయన విడిచి పెట్టేశారు. మరో ఆరేడు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టు సమాచారం.

గురువారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం.  తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో నాదెండ్ల జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పవన్ తో చర్చలు జరిపినట్టు సమాచారం.

టీడీపీతో పొత్తు పెట్టుకొని 2019 ఎన్నికల్లో ఏపీలో పుంజుకుందామని ఆలోచిస్తున్న ఏపీ కాంగ్రెస్ కు నాదెండ్ల పార్టీ మార్పును జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ను చాలా మంది వీడాక.. బలమైన నాదెండ్ల పార్టీ వదలి వెళ్లిపోవడం షాక్ కు గురిచేస్తోంది.. నాదెండ్లకు ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా ఆయన పోవడం పార్టీకి పెద్ద దెబ్బగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

2009 ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.ఉమ్మడి ఏపీ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు.
Tags:    

Similar News