జగన్ పార్టీ వైపు నాదెండ్ల చూపు
మరో ప్రముఖుడు ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి చివరి స్పీకర్ గా వ్యవహరించిన నాదెండ్ల మనోహర్ చూపు.. జగన్ పార్టీ మీద పడినట్లుగా చెబుతున్నారు. అనుభవం, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీదా.. చట్టాల మీద మాంచి పట్టు ఉన్న ఆయన జగన్ పార్టీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
గతంలో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన విభజన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే.. మిగిలిన వారి మాదిరి యాక్టివ్ గా లేరు. త్వరలోనే పార్టీ మారితే ఎలా ఉంటుందన్న ఆలోచన తీవ్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్న జగన్ పార్టీలో చేరితేనే బాగుంటుందన్న ఆలోచనలో మనోహర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో జగన్ పార్టీకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం సాగుతున్న వేళ.. ఆ పార్టీలో చేరటం మంచిదని మనోహర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన.. జగన్ పార్టీ అయితేనే తనకు కంఫర్ట్ గా ఉంటుందని భావిస్తున్నట్లుగా సమాచారం. నాదెండ్ల మనోహర్ తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.. జగన్ పార్టీలో చేరేందుకు మనోహర్ ఆసక్తిగా ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్న మనోహర్ జగన్‌పార్టీలో చేరితే ఆయనకు మరింత లాభంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/