ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ ఎనిమిది ఎక‌రాలు ఇప్పుడు బంగార‌మేనా?

Update: 2022-09-01 16:42 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్ర‌తిపక్ష టీడీపీల‌తోపాటు జ‌న‌సేన పార్టీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయ స్థానాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు క‌దులుతోంది. ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర పేరుతో జిల్లాల‌ను చుట్టేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్టోబ‌ర్ 5 నుంచి పూర్తి స్థాయిలో ప్ర‌చారం చేపట్ట‌నున్నారు. ప‌వ‌న్ బ‌స్సు యాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా జ‌న‌సేన పార్టీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తోడుగా ఆయా జిల్లాల్లో ప‌ర్య‌టించ‌డం చేస్తున్నారు. అభిమానులను స‌మీక‌రించ‌డం, క‌మిటీల ఏర్పాటు, వ‌చ్చే ఎన్నిక‌ల కోసం పార్టీని సిద్ధం చేయ‌డం వంటివి చేస్తున్నారు.

తాజాగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబ‌ర్ 2న పుర‌స్క‌రించుకుని నాగ‌బాబు మీడియాతో సుదీర్ఘంగా ముచ్చ‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రి చూడ‌ట‌మే త‌న లక్ష్య‌మ‌న్నారు. ప‌వ‌న్ యుద్ధం మొదలుపెట్టాడ‌ని.. ఇప్పుడు వెన‌క్కి త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముఖ్య‌మంత్రిగా చేయ‌డానికి త‌న స‌ర్వ‌స్వాన్ని ధార‌పోస్తాన‌ని తెలిపారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు డ‌బ్బులు మీద ధ్యాస‌లేద‌ని.. డ‌బ్బులు ఆదా చేయ‌డంపై అస్స‌లు దృష్టిపెట్ట‌డ‌ని చెప్పారు. అయితే రంగారెడ్డి జిల్లాలోని శంక‌ర‌ప‌ల్లిలో గ‌తంలో 8 ఎక‌రాలు కొన్నాడ‌ని.. ఇప్పుడు ఆ ఎనిమిది ఎక‌రాలు బంగారంగా మారాయ‌ని తెలిపారు.

 ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో  అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ప‌వ‌న్ క‌ల్యాణేన‌ని చెప్పారు. కానీ తాను పారితోషికంగా తీసుకున్న‌ డబ్బును పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం ప‌వ‌న్ కు లేద‌ని నాగ‌బాబు వెల్ల‌డించారు. పార్టీ, ప్రజా సేవ కోసమే తన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేశాడ‌ని వివ‌రించారు. తాను సంపాదించిన మొత్తంలో దాన‌ధ‌ర్మాల‌కే ఎక్కువ మొత్తం ఖ‌ర్చు పెట్టాడ‌న్నారు.

కాగా శంక‌ర‌ప‌ల్లిలో రైల్వే స్టేష‌న్ ఉండ‌టం, ఎంఎంటీఎస్ రైలు స‌దుపాయం ఉండ‌టం, ఔట‌ర్ రింగు రోడ్డు, ప‌రిశ్ర‌మ‌ల‌కు హ‌బ్‌గా మార‌డం, రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్మెంట్ త‌దితర కార‌ణాల‌తో ఇక్క‌డ ఎక‌రం రూ.15 కోట్ల రూ.20 కోట్ల వ‌ర‌కు ఉంద‌ని చెబుతున్నారు. ఈ లెక్క‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని ఎనిమిది ఎక‌రాలు ఇప్పుడు రూ.200 కోట్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News