కేవలం మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చారు నాగబాబు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో నిరూపించుకునే ప్రయత్నం చేశారు కానీ వర్కవుట్ కాలేదు. మధ్యలో నిర్మాతగా మారి చాలానే పొగొట్టుకున్నారు. అప్పటివరకు నాగబాబు అంటే మెగాస్టార్ తమ్ముడు. కానీ జబర్దస్త్ తర్వాత నాగబాబుకు సొంతంగా ఒక ఇమేజ్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. బుల్లితెరపై దూసుకుపోతున్నారు.
ఇక ఇది ఎన్నికల సమయం. ఇన్నాళ్లు కామ్ గా ఉన్న నాగబాబు ఇప్పుడు వైసీపీ - టీడీపీపై చెలరేగిపోతున్నారు. ఓవైపు పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతునిస్తూనే.. చంద్రబాబు - జగన్ టార్గెట్ గా విమర్శలు - వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇవి కూడా జనానికి బాగానే చేరువ అవుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో నాగబాబుపై విమర్శలు కూడా వస్తున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీలో ఉన్నంతకాలం ఈ విమర్శలు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న కూడా నాగబాబుకు ఎదురవుతుంది.
మరోవైపు.. ఏపీలో ఎన్నికల పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. ఎవరు ఏ పార్టీతో కలిసి వెళ్తారో ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. చంద్రబాబు నాయుడు పవన్ వైపు ఆశగా చూస్తుంటే.. పవన్ మాత్రం సోలోగా పోటీ చేస్తానంటున్నాడు. మరోవైపు జగన్ - పవన్ ఇద్దరూ కలిసి పొత్తు ఏర్పరచుకున్నా - లేకపోయినా.. రాబోయే రోజుల్లో లోపాయకారి ఒప్పందం ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఉంటే మాత్రం జగన్ ని ఇంతగా విమర్శిస్తున్న నాగబాబు చిక్కుల్లో పడక తప్పదు.