మెగాబద్రర్ నాగబాబు యూట్యూబ్లో నా ఇష్టం అంటూ సైటైరిక్ వీడియోలు పెడుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబు, సీని నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఏపీ టీడీపీ నేతలపై మాత్రమే నాగబాబు యూట్యూబ్లో సైటైర్లతో కూడిని వీడియోలను పోస్టు చేసేవాడు. ఇప్పుడు నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేస్తూ ఓ సెటైరిక్ వీడియో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుపై నాగబాబు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాల్లో బాబు ప్రసంగించిన తీరుపై నాగబాబు యూట్యూబ్లో కామెంట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్తం పొంగుతోందని వ్యాఖ్యానించారు. దీనిపై నాగబాబు మాట్లాడుతూ ‘‘ పాలు పొంగడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది.. కానీ చంద్రబాబు నాయుడికి రక్తం మరగడానికి నాలుగున్నరేళ్లు పట్టింది..’’ అంటూ సెటైర్ వేశారు. ఎక్కువ మంటపెడితేనే పాలు మరుగుతాయి.. చంద్రబాబుకు ఎలక్షన్లు వస్తేనే రక్తం మరుగుతుందా అంటూ ఘాటూగానే విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా నాగబాబు తన యూట్యూబ్లో పెట్టారు.
కాగా ఇంతకముందు ఇలాగే ఏబీఏన్ రాధాకృష్ణపై నాగబాబు సెటైరిటకల్ వీడియో పెట్టగా కాపీరైట్ ఇష్యూ కారణంగా ఆ వీడియో తొలగించారు. దీంతో ఇప్పiడు చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించిన క్లీప్ కూడా కాపీరైట్ ఇష్యూ ఎదుర్కొంటుందా అనే ప్రశ్న తలెత్తుంది. నాగబాబు నేరుగా చంద్రబాబును టార్గెట్ చేయడం ఇదే ప్రథమం. అయితే ఈ వీడియో కూడా కాపీరైట్ ఇష్యూ కారణం ఉంటుందా? ఊడుతుందా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా నాగబాబు వరుసగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. చంద్రబాబును ఒక్కమాట అన్న అంతెత్తున లేచే టీడీపీ శ్రేణులు నాగబాబుపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది. మరీ నాగబాబు వారికి ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరీ..
Full View