నాగం టీడీపీలో చేర‌నున్నారా?

Update: 2016-12-17 06:31 GMT
తెలంగాణ తెలుగుదేశం ఫోరం మాజీ క‌న్వీన‌ర్‌ - బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు నాగం జనార్థన్‌ రెడ్డి సొంత గూడు అయిన టీడీపీలో చేర‌నున్నారా? త‌ను ప్ర‌స్తుతం ఉన్న బీజేపీలో పోరాటం చేసే స్వేచ్ఛ కనిపించ‌క‌పోవ‌డం ఇందుకు కార‌ణామా?  తాజాగా జ‌రిగిన ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా  టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన నాగం జ‌నార్ద‌న్ రెడ్డి - టీడీపీ కార్యనిర్వహక అద్యక్షుడు ఏ.రేవంత్‌ రెడ్డి - ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య - పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలతో మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. దాదాపు గంట‌కు పైగా సాగిన ఈ భేటీపై రాజ‌కీయ వ‌ర్గాలు కొత్త చ‌ర్చ‌ను మొద‌లుపెట్టాయి.

తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న స‌మ‌యంలోనే జేపీ సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. టీడీపీని వ్యతిరేకించి బీజేపీలో చేరిన నాగం సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీ కార్యాలయంలోకి రావడం - అక్కడ పార్టీ నేతలతో కొద్ది సేపు రహస్యంగా చర్చలు జరపడం లాబీల్లో పెద్ద చర్చకు దారితీసింది. టీడీపీలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన నాగం జనార్థన్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే!. అయితే రాజకీయాలపై పూర్తి అవగాహన - వ్యూహాన్ని రచిస్తూ ముందుకు వెళ్లే నాగంకు బీజేపీలో తదినంత గౌరవం ఇవ్వడంలేదని - తిరిగి టీడీపీ గూటికి వెళ్లేందుకే మంతనాలు జరిపారని అసెంబ్లీ ఆవరణతో పాటు లాబిల్లో గుసగుసలాడుకున్నారు. మరికొంత మంది అయితే గులాబీ దళపతి కేసీఆర్‌ - కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేయాలని ఉత్సుకత చూపుతున్నారని దీంతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు తెలంగాణ సర్కార్‌ పై విమర్శలు చేసే వీలులేదని - సర్కార్‌ పై టీడీపీ నేతలను ఉసికొల్పేందుకు టీడీపీ నేతలతో నాగం జనార్థన్‌ రెడ్డి టీడీపీ నేతలకు క్లాస్‌ ఇచ్చారని మరికొందరు అనుకోవడం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసేందుకు శాసనసభలో టీడీపీ అనుసరించాల్సిన వైఖరిపై ఆ పార్టీ నేత‌ల‌కు నాగం ఏకంగా ఒక క్లాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ తో బీజేపీకి ఎలాంటి పొత్తు లేదు. పైపెచ్చి కేసీఆర్‌ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారంటూ బీజేపీ ఆరోపిస్తూ వస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తున్నప్పటికీ మొదటి రోజు అసెంబ్లీలో నోట్ల రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని కేసీఆర్‌ స్వాగతించడంతో ఇక ఏం మాట్లాడాలో బీజేపీ నేతలకు అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది తాము ఈ అంశంపై ఎలాగూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం... కనీసం మీరైనా గట్టిగా మాట్లాడండి... అని హితవు చెప్పడానికి బీజేపీ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత నేరుగా తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయంలోకి వచ్చార‌ని అంటున్నారు. కాగా..సుదీర్ఘ కాలం టీడీపీలో కొనసాగిన నాగం ఆ తర్వాత బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీ నేతలతో అది కూడా (పాత) మహబూబ్‌ నగర్‌ జిల్లాకే చెందిన నేతలతో ఆయనకున్న సాన్నిహిత్యంతో టీడీపీ కార్యాలయంలోకి వెళ్లారే తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రధాన్యత లేదని, రాజకీయంగా కూడా ఇరు పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నందున ఈ భేటీకి అంతగా ప్రాధాన్యత లేదని నాగం సన్నిహితులు చెబుతున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News