ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలనే ఏలిన నేత ఆయన.. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కొనసాగిన నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పుడు ఎటూ కాకుండా పోయాడు. నాగర్ కర్నూల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా.. ఉమ్మడి ఏపీలో టీడీపీ మంత్రిగా 9 ఏళ్లు పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో టీడీపీని వీడి ‘తెలంగాణ నగారా సమితి’ అనే పార్టీ ని స్థాపించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరారు. చివరగా బీజేపీలో ఇమడలేక ఇప్పుడు కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో చేరి అనామకంగా పడి ఉంటున్నారు.
టీడీపీలో ఉన్నప్పుడు ఒకనొక దశలో చంద్రబాబు తర్వాత రెండో స్థానంలో ఉన్న నాగం.. ఇప్పుడు కాంగ్రెస్ కండువా వేసుకున్నాక పూర్వ వైభవం సాధించడం పక్కన పెట్టి కనీసం రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు పొందలేక ఇబ్బంది పడుతున్నాడట.. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో ఎలా ఎదగాలో తెలియక తలపట్టుకుంటున్నారట..
కాంగ్రెస్ లో కూడా నాగంకు అస్తిత్వం కోసం పోరాడే పరిస్థితి తలెత్తిందని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి నాగం కాంగ్రెస్ లో చేరడాన్ని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు స్వాగతించలేదు. ఆయన రాకను అడ్డుకునే ప్రయత్నాలను చాలానే చేశారట.. కానీ నాగం.. ఏకంగా రాహుల్ గాంధీని కలిసి ఆయన ఆశీస్సులు పొంది కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎంత వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ లో నాగం చేరిపోవడంతో ఇక మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన అనుచరులు భావించారు. కానీ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ను ప్లే చేయలేక ఇప్పుడు నాగం ఆగమాగం అవుతున్నారట.. పార్టీ లో ఎదురవుతున్న అడ్డంకులను నాగం అధిగమించలేకపోతున్నారట..
2019లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నాగం సేవలను వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. కానీ గ్రూప్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ లో నాగంను ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తూ ఆయనను బయటకు రాకుండా ఓ వర్గం కాంగ్రెస్ నేతలు తొక్కేస్తున్నారనే ప్రచారం ఉంది. కాంగ్రెస్ లో ఈ తరహా రాజకీయాలు ఎప్పటినుంచో ఉన్నవి. కానీ వాటిని ఎదుర్కొని నాగం బయటపడలేక కనుమరుగైపోవడమే ప్రస్తుతం ఆయన అనుచరులను బాధిస్తోంది. 2019 ఎన్నికల వరకైనా ఇబ్బందులు అధిగమించి నాగం కీరోల్ పోషిస్తారా.? లేక కాంగ్రెస్ లో ఇమడలేక ఈ పార్టీ నుంచి కూడా బయటకు వస్తారా అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.