కేసీఆర్‌కు నాగార్జున సోదరుల ఆత్మీయ పరామర్శ

Update: 2017-09-11 19:22 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున పరామర్శించారు. ఇటీవలే కేసీఆర్ కంటి ఆపరేషన్ చేయించుకోవడంతో ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు నాగారర్జున తన సోదరుడు అక్కినేని వెంకట్ తో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా సీఎం  ఆరోగ్యంపై నాగార్జున వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్భంగా నాగార్జున, కేసీఆర్ ల మధ్య సినీరంగానికి సంబంధించిన చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో తెలుగు సినీరంగం  గురించి వారు మాట్లాడుకున్నారని టీఆరెస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో మరిన్ని ఫిలిం స్టుడియోలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న గ్రాఫిక్స్ రంగాన్ని ప్రోత్సహించడంపైనా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య పెళ్లి ఏరర్పాట్లు గురించి కేసీఆర్ వివరాలు అడిగారు.

    కాగా కంటి ఆపరేషన్ చేసుకున్న కేసీఆర్ ను పరామర్శించేందుకు రాజకీయ, సినీ రంగాల నుంచి ప్రముఖులు ఆయన ఇంటికి వస్తున్నారు. నాగార్జున కంటే ముందు తెలంగాణ‌ శాస‌న మండలి ఛైర్మ‌న్ స్వామి గౌడ్, కొందరు టీఆర్ఎస్ నేత‌లు కూడా కేసీఆర్‌ను కలిసి ప‌రామ‌ర్శించారు.              
Tags:    

Similar News