మొన్ననే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు పవన్ కళ్యాణ్.. నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు రాజకీయంగా కూడా పరోక్ష పోరుకు సిద్ధమవుతున్నారు వీళ్లిద్దరూ. ప్రస్తుతం పవన్.. బాలయ్య ఒకే జిల్లాలో మకాం వేసి ఉండటం విశేషం. బాలయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అనంతపురం జిల్లాలోనిదే అన్న సంగతి తెలిసిందే. ఆయన అక్కడికి తరచుగా వెళ్తుంటారు. అది మామూలు వ్యవహారమే. ఐతే బాలయ్య అక్కడున్న సమయంలోనే పవన్ కూడా ఆ జిల్లాలో అడుగుపెట్టడమే ఇప్పుడు పెద్ద విశేషం. ఇప్పటికే తెలంగాణలో తన రాజీకీయ యాత్రను మొదలుపెట్టి.. కరీం నగర్ జిల్లాలో కొన్ని రోజులు పాటు పర్యటించిన పవన్.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి వచ్చాడు.
కదిరి నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అనంతపురం జిల్లాలో పవన్ మూడు రోజుల పాటు పర్యటించనున్నాడు. పవన్ ఈసారి పూర్తి స్థాయి రాజకీయ పర్యటన చేస్తున్నాడు అనంతపురంలో. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణంపై అతను దృష్టిసారించనున్నాడు. నేతలు.. కార్యకర్తల్ని తయారు చేసుకోవడంపై పవన్ ఫోకస్ చేస్తాడట. 2019 ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య అనంతపురంలో ఉండగానే పవన్ కూడా సందడి చేయనుండటంతో జనాల నుంచి ఎవరికెలాంటి స్పందన ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు సీనియర్ నటుడు సుమన్ కూడా అనంతపురం జిల్లాలో ఇదే సమయంలో పర్యటిస్తుండటం విశేషం. మొత్తంగా ఈ పర్యటనలతో జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది.