కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా - తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం. ఢిల్లీలోనే కాదు దేశంలోని ప్రతి గల్లీలోను తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటారు మహనీయుడు ఎన్టీఆర్. తెలుగువారి పట్ల చిన్న చూపు చూసిన కాంగ్రెస్ పార్టీని దేశంలోని అన్ని చెరువుల నీరు తాగించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ స్థాపించి దక్షిణాది రాష్ట్రాలకు మార్గదర్శకత్వం చేశారు. అంతటి ఘనత వహించిన అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి చంద్రబాబు నాయుడు పార్టీని చంపేశారని నందమూరి వంశస్థులు పార్టీ పరిస్థితి పట్ల ఆవేదనతో - బాబు పట్ల ఆగ్రహావేశాలతో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్లు యుద్దం చేసిన తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముందు మోకరిల్లిందని నందమూరి కుటుంబీకులు కలత చెందుతున్నారట. ఎన్టీఆర్ కుమారుడు హరిక్రిష్ణ బతికి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని భావిస్తున్నారట. కచ్చితంగా దీనిపై గొంతెత్తి బాబును హరికృష్ణ చీల్చిచండాడేవాడని అంటున్నారట.
చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత అవసరాల రీత్యా తెలుగుదేశం పార్టీని - కాంగ్రెస్ పార్టీకి తాకట్టుపెట్టారనే ఆలోచన నందమూరి కుటుంబం సభ్యులలో వస్తోందని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి వియ్యంకుడు - ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారని విశ్వసనీయ సమాచారం. భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడికి వచ్చిన విబేధాలకు తెలుగుదేశం పార్టీని బలి చేయడం భావ్యం కాదని - నందమూరి కుటుంబీకులు భావిస్తున్నారట. లక్ష్మీ పార్వతిని సాకుగా చూపి గతంలో తమ తండ్రి ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని - పార్టీని చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారని ఇప్పటికే వారు పురంధేశ్వరి వంటి వారు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తమ తండ్రి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి మానసికంగాను - శారీరకంగాను చంపేయడమే కాకుండా ఆ నింద బాబు వల్ల తమపై కూడా పడిందనే భావన కుటుంబ సభ్యులలో ఉందట. ఇపుడు మరో ఘోరం చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారట.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించడం - ఎన్టీఆర్ బద్దశత్రువుతో చేతులు కలపాలనుకోవడం పార్టీని చంపేసినట్టుగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలలో శాశ్వత శత్రువులు - శాశ్వత మిత్రులు ఉండరనేది వాస్తవమే అయినా - చంద్రబాబు చేసిన పనిమాత్రం తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ హర్షించరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తన అధికారం కోసం ఎంతటి దారుణానికైన చంద్రబాబు నాయుడు పాల్పడతారు అనడానికి తాజా సంఘటనే ఉదాహరణగా చెబుతున్నారు. జాతీయ స్ధాయిలో మహాకూటమి ఏర్పాటు వాంఛనీయమే అయినా కాంగ్రెస్ పార్టీతో కలవడం మాత్రం నందమూరి కుటుంబ సభ్యులకు జీర్ణం చేసుకోలేకపోతున్నాట.