నందమూరి ఇంట..కూకట్‌ పల్లి చిచ్చు

Update: 2018-11-14 05:23 GMT
కూకట్ పల్లి సెటిలర్లు ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన తెలుగు వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి తెలుగు దేశం నుంచి కాని మహాకూటమి నుంచి కాని, లేదు వేరొక పార్టీ నుంచైన ఆంధ్రులు ఎవరూ పోటి చేసిన విజయం వచ్చి వారి వళ్లో వాలుతుంది.. అందుకే కూకట్‌ పల్లి నియోకవర్గానికి అంత డిమాండ్. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కూకట్‌ పల్లి నుంచి పోటి చేసేందుకు మహాకూటమిలోని పార్టీలే కాదు తెలంగాణ రాష్ట్ర తీవ్ర పోటి నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి  తాజా మాజీ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇచ్చి ఊపిరి పీల్చుకుంది. ఇక మహాకూటమి లోనే కూకట్‌ పల్లి చిచ్చు రగులుతోంది. ఈ స్దానాన్ని కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశానికి కేటాయించిన తర్వాత టిక్కెట్టు రచ్చ మరింత పెరిగింది. ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్దిగా బరిలో దిగేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు - కరీంనగర్‌ జల్లాకు చెంది ఇ. పెద్దిరెడ్డి కూకట్‌ పల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్దిగా తాను పోటి చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు పెద్ద బైక్ ర్యాలి కూడా తీసారు.

పెద్దిరెడ్డె తెలుగుదేశం అభ్యర్ది అని దాదాపు ఖరారైన తర్వాత మళ్లీ మరో పేరు తెర మీదకు వచ్చింది. దీంతో కూకట్‌ పల్లి రచ్చ రంబోల అవుతోంది. నందమూరి తారక రామారావు మనుమరాలు - ఇటీవలే కాలం చేసిన నందమూరి హరిక్రిష్ణ కుమార్తే చుండ్రు సుహాసిని పేరు తెర మీదకు వచ్చింది. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌ సభ సభ్యుడిగా చేసిన చుండ్రు శ్రీహరి కుమారుడు - చుండ్రు శ్రీకాంత్ భార్య. ఇప్పుడు ఈ పేరు తెరపైకి రావడంతో పెద్దిరెడ్డి వర్గీయులు మండిపోతున్నారు. మరోవైపు నందమూరి కుటుంబీకులు కూడా చంద్రబాబుపై నారాజుగా ఉన్నారంటున్నారు. దీనికి కారణం నందమూరి వంశం వారికే టిక్కెట్టు ఇవ్వాలను కుంటే హరిక్రిష్ణ కుమారులకు ఇవ్వవచ్చునని అంటున్నారు. అంతే కాని ఇంటి పేరు మారి మరొక వంశానికి చెందిన గుర్తింపు తెచ్చుకున్న తమ ఆడపడుచుకు నందమూరి కోటలో టిక్కెట్టు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే కూకట్‌ పల్లి టిక్కెట్టు కూడా కాంగ్రెస్  ఖాతా లోనే ఉంటుందని సుహాసిని మామగారు చుండ్రు శ్రీహరి ఇప్పటికీ కాంగ్రెస్ నాయకుడేనని తెలుగు తమ్ముళ్ల వాదన. కూకట్‌ పట్టి చిచ్చు నామినేషన్లు పూర్తయే నాటికి మరెంత పెరుగుతుందో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News