తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నట్లున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతల మధ్య ఉండగా ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఈ ట్రెండ్ మొదలయినట్లు చెప్తున్నారు. త్వరలో జరగనున్న నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలుగుదేశం నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, సీటు ఆశిస్తున్న వారంతా ప్రముఖులే కావడంతో ఎవరికి ఇవ్వాలో అర్ధంకాని గందరగోళ పరిస్థితి నెలకొంది. వీరిలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు వారిని ఓడిస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు.
నంద్యాల సీటు మళ్లీ తనకే ఇవ్వాలని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పట్టుపడుతున్నారు. శిల్పా తప్ప మరెవరూ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేద్దామనుకుంటున్నట్లు శిల్పా ఈ సందర్భంగా మనసులోమాట బయటపెట్టారని సమాచారం. అయితే దానిని వ్యతిరేకించిన ఆయన వర్గీయులు, సీటు ఇస్తే పార్టీలో ఉండాలని, లేకపోతే వైసీపీ నుంచి చేయాలని పట్టుపట్టారని అంటున్నారు. అంతకుముందు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఎన్‌ఎండి ఫరూఖ్ కూడా తన వర్గీయులతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనారిటీ అయిన ఫరూఖ్‌కు ఈసారైనా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వకపోతే, ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని ఆయన అనుచరులు హెచ్చరించారు. శిల్పాకు సీటు ఇస్తే తాము పనిచేసేది లేదని, ఆ విషయాన్ని అధిష్ఠానానికి చెప్పేయాలని వారంతా ఫరూఖ్‌కు సూచించారని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఒకవేళ వైసీపీ మైనారిటీ అభ్యర్థిని నిలబెడితే మద్దతునివ్వాలని, లేకపోతే ఇండిపెండెంట్‌గా ఒకరిని నిలబెట్టాలని సూచించారని టాక్.
ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. ఆయన వర్గం కూడా సీటు తనకే ఇవ్వాలని పట్టుపడుతోంది. ఒకవేళ ఫరూఖ్‌ను సంతృప్తిపరచకుండా శిల్పాకు సీటు ఇస్తే, ఆయనకు సహాయ నిరాకరణ ఖాయంగా కనిపిస్తోందని నాయకులు చెప్తున్నారు. అటు భూమా కుటుంబం టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉంది. భూమా నాగిరెడ్డి సోదరుడైన మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కుమారుడు, యువ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి వారసత్వం ఆయనకు కాకుండా, సోదరుడైన భూమా నాగిరెడ్డికి దక్కిందని, అప్పుడు తాము కూడా నాగిరెడ్డినే బలపరిచామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నాగిరెడ్డి లేనందున న్యాయంగా బ్రహ్మానందరెడ్డికే దక్కాలని కుటుంబసభ్యులు కూడా వాదిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో భూమా కుటుంబంలో విబేధాలున్నట్లు చెప్తున్నారు. చాలాకాలం నుంచి భూమా కుటుంబానికి, బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఆస్తులు, ఇతర కారణాలతో పొసగడం లేదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మంత్రి అయిన అఖిలప్రియ మాత్రం సోదరుడైన బ్రహ్మనందరెడ్డికి సీటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక మాత్రం ఆయనకు ఇవ్వకూడదన్న పట్టుదలతో ఉన్నారనే మాట వినిపిస్తోంది. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ నాగిరెడ్డిని ప్రస్తుతం ఆ కుటుంబం దూరంగా పెట్టడంతో నాగిరెడ్డి కుటుంబానికి సరైన సలహా కూడా ఇచ్చేవారు కరవయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఉప ఎన్నికల సాక్షిగా లుకలుకలు మొదలయినట్లున్న చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నట్లున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతల మధ్య ఉండగా ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఈ ట్రెండ్ మొదలయినట్లు చెప్తున్నారు. త్వరలో జరగనున్న నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలుగుదేశం నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, సీటు ఆశిస్తున్న వారంతా ప్రముఖులే కావడంతో ఎవరికి ఇవ్వాలో అర్ధంకాని గందరగోళ పరిస్థితి నెలకొంది. వీరిలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు వారిని ఓడిస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు.

ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి కూడా సీటు ఆశిస్తున్నారు. ఆయన వర్గం కూడా సీటు తనకే ఇవ్వాలని పట్టుపడుతోంది. ఒకవేళ ఫరూఖ్‌ను సంతృప్తిపరచకుండా శిల్పాకు సీటు ఇస్తే, ఆయనకు సహాయ నిరాకరణ ఖాయంగా కనిపిస్తోందని నాయకులు చెప్తున్నారు. అటు భూమా కుటుంబం టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఉంది. భూమా నాగిరెడ్డి సోదరుడైన మాజీ ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి కుమారుడు, యువ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి వారసత్వం ఆయనకు కాకుండా, సోదరుడైన భూమా నాగిరెడ్డికి దక్కిందని, అప్పుడు తాము కూడా నాగిరెడ్డినే బలపరిచామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నాగిరెడ్డి లేనందున న్యాయంగా బ్రహ్మానందరెడ్డికే దక్కాలని కుటుంబసభ్యులు కూడా వాదిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో భూమా కుటుంబంలో విబేధాలున్నట్లు చెప్తున్నారు. చాలాకాలం నుంచి భూమా కుటుంబానికి, బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఆస్తులు, ఇతర కారణాలతో పొసగడం లేదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. మంత్రి అయిన అఖిలప్రియ మాత్రం సోదరుడైన బ్రహ్మనందరెడ్డికి సీటు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక మాత్రం ఆయనకు ఇవ్వకూడదన్న పట్టుదలతో ఉన్నారనే మాట వినిపిస్తోంది. భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఏవీ నాగిరెడ్డిని ప్రస్తుతం ఆ కుటుంబం దూరంగా పెట్టడంతో నాగిరెడ్డి కుటుంబానికి సరైన సలహా కూడా ఇచ్చేవారు కరవయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి కుటుంబంలో ఉప ఎన్నికల సాక్షిగా లుకలుకలు మొదలయినట్లున్న చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/