తెలుగు వారికి ఏ మాత్రం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. నారా బ్రాహ్మణి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముద్దుల మనమరాలుగా.. ఎమ్మెల్యే తండ్రి బాలయ్య కుమార్తెగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలిగా.. ఏపీ మంత్రి నారా లోకేశ్ సతీమణిగా.. అన్నింటికి మించి హెరిటేజ్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలంటే ఏమాత్రం ఇంట్రస్ట్ లేదని చెప్పే బ్రాహ్మణి.. వ్యాపారంలోనే తనకు ఆసక్తి అని చెబుతుంటారు. ప్రస్తుతం రూ.2400 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీని రానున్న ఐదేళ్ల వ్యవధిలో రూ.6వేల కోట్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యంగా పని చేస్తున్నారు. మీడియాకు దూరంగా ఉండే ఆమె.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యాపార.. వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించారు. ఇందులోని ఆసక్తికర అంశాల్ని చూస్తే..
+ మామయ్య చంద్రబాబు హెరిటేజ్ ను స్టార్ట్ చేశారు. 25 ఏళ్లలో ఏ రైతుకు పేమెంట్ విషయంలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదు. కంపెనీకి సంబంధించి మరీ అవసరమైతే మామయ్య.. లోకేశ్ ల సలహా అడుగుతా. కంపెనీ చాలా ప్రొఫెషనల్ గా నడుస్తుంటుంది. చదువు విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్. షూటింగ్ లకు అస్సలు వెళ్లేవాళ్లం కాదు. సెలవులు వచ్చినప్పుడు వర్క్ షాపులకు వెళ్లేవాళ్లం. దీంతో.. సినిమా రంగం మీద అస్సలు ఆసక్తి కలగలేదు. రాజకీయాలకు వెళ్లాలన్నా ఆలోచన రాలేదు.
+ పని ఒత్తిడి ఎంత ఉన్నా.. ఇంటికివెళ్లగానే దేవాన్ష్ ను చూసిన వెంటనే ఒత్తిడి మొత్తం పోతుంది. అతడు నా స్ట్రెస్ బస్టర్. ఇంటికి వచ్చాక ఆఫీసు పని పెట్టుకోను ఫ్యామిలీ సభ్యులతోనే గడుపుతా. తర్వాతే ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో బాగా బిజీగా ఉన్నారు. గతంలో లోకేశ్ మెసేజ్ లతో అయినా టచ్ లో ఉండేవారు. మంత్రి అయ్యాక మెసేజ్ లు కూడా లేవు. కంప్లైంట్ చేయటం లేదు. ఎందుకంటే వాళ్ల ముందు చాలా పెద్ద లక్ష్యం ఉంది. మంత్రి అయ్యాక లోకేశ్ రెండు వారాలకోసారి దేవాన్ష్ ను చూస్తున్నారు. మామయ్య అయితే ఏ రెండు నెలలకో దేవాన్ష్ దగ్గరకు వస్తున్నారు. అంత బిజీగా ఉన్నారు వారు. వర్క్‌ను.. లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవటం చాలా కీలకం. అత్తగారు నాకు చాలా సపోర్ట్ గా ఉంటారు. ఏ మాత్రం వీలు కలిగినా వర్క్‌ను.. లైఫ్ ను మిక్స్ చేస్తారు. వీకెండ్స్ లో స్టోర్స్ ను విజిట్ చేయాల్సి వచ్చినప్పుడు దేవాన్ష్‌ను వెంట తీసుకెళుతుంటా.
+ చిన్నప్పుడు చాలా లావుగా ఉండేదాన్ని. స్కూల్లో టీచర్లు.. స్టూడెంట్స్ టీజ్ చేసేవారు. అయితే.. స్పోర్ట్స్‌లో ఎక్కువగా పాల్గొనటం.. జిమ్ కు వెళ్లటంతో బరువు తగ్గా. ఈ విషయంలో మా అత్తగారు నాకు స్ఫూర్తి. ఆమె ఏడాది వ్యవధిలో 60 కేజీల వరకూ తగ్గారు. స్విమ్మింగ్.. జాగింగ్ చేయటంతో వల్ల ఒత్తిడిని అధిగమించొచ్చు. ఫుడ్ అంటే చాలా ఇష్టం.. నా వీక్ నెస్ కూడా. ప్రత్యేక సందర్భాల్లో బాగా తినేందుకు ఇష్టపడతా. బయట రెస్టారెంట్స్‌కు వెళ్లటం అంటే చాలా ఇష్టం.
+ హెరిటేజ్ స్టోర్స్ కు సర్ ప్రైజ్ విజిట్స్ కు వెళుతుంటా. నాతో పోలిస్తే అత్తగారు చాలా ఎక్కువగా స్టోర్స్ విజిట్స్ కు వెళుతుంటారు. వారంలో మూడు.. నాలుగు రోజులు హెరిటేజ్ కోసం ట్రావెల్ చేస్తుంటారు. కంపెనీలో ప్రొఫెషనల్ గా టఫ్ గా ఉండాలి. ఉండక తప్పదు. అదే టైంలో ఆపీస్ లో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. అందరిని సమానంగా చూస్తాం. ఉద్యోగులుగా కాకుండా కోలీగ్స్ గా చూస్తాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/