జగన్‌లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు కనిపించేదా..!: చంద్రబాబు
తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్‌లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు ఎక్కడా ఉండేది కాదని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుజాతికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్మాణానికి తట్ట మట్టి కూడా వేయనివాడు పేర్లు మార్చే నీచ సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి చేష్టలతో పిచ్చి తుగ్లక్‌గా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని దుయ్యబట్టారు. యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ తెలుగుదేశం నిర్విరామ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన నందమూరి తారకరాముడి పేరు ఆరోగ్య వర్సిటీ నుంచి తొలగించి సీఎం జగన్ పెద్ద తప్పు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ మాదిరిగా తాను ఆలోచించి ఉంటే.. కడప జిల్లాకు వైఎస్సార్ పేరు ఉండేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నీచ సంస్కృతికి తెరలేపారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్ పేరు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సాధికారక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టేవరకు ఊరుకునేది లేదు. పేరు మార్చి జగన్ తన నీచ బుద్దిని బయటపెట్టుకున్నారు. నేను తలుచుకుంటే కడపకు వైఎస్సార్ పేరు ఉండేదా..? పేర్లు మార్చడం నాకు చేతకాదా..? కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టి.. వైఎస్సార్ పేరు పెట్టుకోవచ్చు.. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి.. వైఎస్సార్ పేరు పెట్టుకో.." అని అన్నారు
బలహీనవర్గాల వారి వల్లే పార్టీ బలంగా ఉందని తెలిపారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. గతంలోని నేతలు బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా చూశారని.. కానీ ఎన్టీఆర్ అనేకమంది బీసీలకు కీలక పదవులు ఇచ్చారని వెల్లడించారు. బీసీల నాయకత్వాన్ని పెంచింది పార్టీ మాత్రమే అని.. అందుకోసం ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చారన్నారు.
దేశంలో గురుకుల పాఠశాలలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని.. బీసీ విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకం తీసుకువచ్చామన్నారు. ఆనాడు నేను ఐటీ గురించి మాట్లాడితే విమర్శించారని.. సెల్ఫోన్ల కోసం కృషి చేస్తే.. సెల్‌ఫోన్ తిండి పెడుతుందా అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.