ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు- తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త పేరు పెట్టారు. సందర్భానుసారం జగన్ పై విమర్శలు చేసే లోకేష్ తాజాగా విద్యార్థుల సమావేశంలోనూ విమర్శలు ఎక్కుపెట్టారు. కృష్ణా పుష్కరాల్లో విశిష్టమైన సేవలందించారని పేర్కొంటూ టీడీపీ అనుబంధ తెలుగునాడు సూడెంట్స్ ఫెడరేషన్ నాయకులకు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అభినందనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... జగన్‌పై కొత్త విమర్శ చేశారు.
వైసీపీలో ఉన్న నేతలంతా అవినీతిపరులేనని లోకేష్ మండిపడ్డారు. ఒక గూటి పక్షులన్నీ ఒకచోటికి చేరిన విధంగా అవినీతిపరులంతా జగన్ చుట్టూ చేరారని ఆరోపించారు. జగన్ కు కుడివైపు ఏ-2 నిందితుడు విజయసాయిరెడ్డి, ఎడమవైపు, వెనుకా, ముందు ఏ3 - ఏ4 - ఏ5 నిందితులే ఉన్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. దేశంలో ఏ కుంభకోణం జరిగిన ఆ మూలాలు వైకాపానుంచి వచ్చినవేనని ఆరోపించారు. ఇటీవల కల్తీ మద్యంలో వైకాపా నేతల వివరాలు బహిర్గతం అవగా..తాజాగా ఆ పార్టీ నేత బాలశౌరీ ఉదంతం బయటకు వచ్చిందని లోకేష్ ఉదహరించారు. క్రమం తప్పకుండా ఆస్తులు ప్రకటిసూ తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తుంటే...ఆస్తులు ప్రకటించడానికి ప్రతిపక్ష నాయకులు ఎందుకు భయపడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు.
భవిష్యత్తు గురించి ఆలోచించేవారినే ప్రజలు ఆదరిస్తారని నారా లోకేష్ ఈ సందర్భంగా విద్యార్థి నేతలకు ఉద్బోదించారు. నిజాయితీగా పనిచేస్తూ టీఎన్ ఎస్ ఎఫ్ మిగతా అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. అధికారంతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. పుష్కరాల్లో 12 రోజులపాటు చూపిన స్ఫూర్తిని కొనసాగించి విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. విద్యార్థి సంఘం నాయకుల పనితీరును గుర్తించి పార్టీ తగు విధంగా న్యాయం చేస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/