కేటీఆర్ కంటే బంప‌ర్ మెజారిటీ!..లోకేశ్ స‌వాల్ చేస్తారా!

Update: 2019-03-13 14:12 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యం నేటితో తేలిపోయింది. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరి నుంచి ఆయ‌న పోటీ చేస్తార‌ని పార్టీ అధిష్ఠానం నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఓ కీల‌క పార్టీ అధినేత వార‌సుడిగా దొడ్డిదారిన ఎలా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ఎంట్రీ ఇస్తార‌ని - మంత్రి ప‌ద‌విని కూడా దొడ్డిదారినే ఎలా స్వీక‌రిస్తార‌ని లోకేశ్ పై ఇటు విప‌క్షాల నుంచే కాకుండ అటు సోష‌ల్ మీడియాలో కూడా సెటైర్ల మీద సెటైర్లు ప‌డిపోతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ ద‌ఫా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల్సిందేన‌ని నిర్ణ‌యించుకున్న లోకేశ్... త‌న‌కు సేఫ్ జోన్‌ ను నిర్ణ‌యించాల‌ని త‌న తండ్రి, పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టారు.

ఈ ప్ర‌తిపాద‌న‌పై లెక్క‌లేన‌న్ని స‌మీక్ష‌లు చేసిన చంద్ర‌బాబు... చివ‌ర‌కు గుంటూరు జిల్లా ప‌రిధిలోని మంగ‌ళ‌గిరిని లోకేశ్ కు కేటాయించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలుగు త‌మ్ముళ్లు.. ప్ర‌త్యేకించి మంగ‌ళ‌గిరి పార్టీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు అక్క‌డ లోకేశ్ గెలిచి త‌న గౌర‌వాన్ని కాపాడుకుంటారా?  లేదంటే... సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైపీసీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాల‌వుతారా? అన్న చ‌ర్చ‌కు తెర లేసింది. ఇదిలా ఉంటే... గెలుపు సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.... ప్ర‌తి విష‌యంలోనూ టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - ప్ర‌స్తుతం ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో త‌న‌ను తాను పోల్చుకుంటున్న లోకేశ్... తాను తీసుకున్న మంత్రి ప‌ద‌వుల విష‌యంలోనూ కేటీఆర్‌నే ఫాలో అయ్యారు.

ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో తాను విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని - మొన్న‌టి తెలంగాణ ఎన్నిక‌ల్లో కేటీఆర్‌ కు ల‌భించిన మెజారిటీ కంటే మెరుగైన ఓట్ల‌నే సాధిస్తాన‌ని లోకేశ్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద కాస్త ధీమానే వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. అయితే ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా బ‌హిరంగంగా మాట్లాడేందుకు స‌సేమిరా అంటున్న లోకేశ్... నిత్యం ట్విట్ట‌ర్‌ నే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ కంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధిస్తాన‌ని లోకేశ్ ట్వీట్ పెడ‌తారా? అంటూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అదే జ‌రిగితే... ఎన్నిక‌ల‌య్యాక జ‌నం మాత్రం లోకేశ్ కు తాను పెట్టిన ట్వీట్ నే రీ ట్వీట్ చేస్తూ ఓ ఆటాడేసుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News