ప‌వ‌ర్ ఫుల్ లోకేష్‌

Update: 2016-11-08 22:30 GMT
ఏపీ ప‌వ‌ర్ పాలిటిక్స్‌ లో సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ప‌వర్ ఫుల్‌ గా మారుతున్నారా? చ‌ట్ట ప్ర‌కారం ఆయ‌న అధికారంలో లేక‌పోయినా.. తెర వెనుక చ‌క్రం తిప్పుతున్నారా? ఆయ‌న చెప్పిన ప్ర‌కార‌మే అంతా జ‌రుగుతోందా? ఆయ‌న ఆదేశాలు చంద్ర‌బాబు ఆదేశాల క‌న్నా వేగంగా అమ‌లువుతున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఏపీలో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తెర వెనుక అధికారం చెలాయిస్తున్నారంటూ.. వైకాపా ప‌త్రిక పెద్ద ఎత్తున వార్త‌లు గుప్పించింది.  తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొడుకు పెత్త‌నం చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, అప్ప‌ట్లో ఈ ప్ర‌చారాన్ని లోకేష్ పెద్ద ఎత్తున ఖండించారు.

దీంతో టీడీపీలోని ఒక‌రిద్ద‌రు నేత‌లు అప్ప‌టి నుంచి లోకేష్‌ ను చ‌ట్ట‌బ‌ద్ధంగా మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాలంటూ ఓ ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కి తెచ్చారు. దీనికి అంద‌రూ స‌హక‌రిస్తార‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే,త‌న త‌న‌యుడిని ఉన్న‌ట్టుండి మంత్రిని చేయ‌డంలో చంద్ర‌బాబు ఎందుకో పెద్ద ఆస‌క్తి చూప‌లేదు. అయితే, త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో లోకేష్‌ కు బెర్త్ ఖాయం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇంత‌లోనే లోకేష్ తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌నే విష‌యం ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న త‌న‌కు ఇష్టంలేని అధికారుల‌పై వేటు వేసేలా ఆఫ్ ది రికార్డ్ ప‌నులు చేస్తున్నార‌నే టాక్ ఉంది.

తాజాగా ముఖ్య‌మంత్రి భ‌ద్రతా సిబ్బందిలో ఇద్ద‌రు కీల‌క అధికారుల‌ను ఉన్న‌ప‌ళంగా బ‌దిలీ చేశారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కాక‌ముందు నుంచే సెక్యూరిటీగా ఉంటున్న ఆ ఇద్ద‌రి బ‌ద‌లీ నిర్ణ‌యం లోకేష్‌ దే అనీ - లోకేష్ ఏదనుకుంటే అది జ‌రిగిపోతుంద‌నీ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఇంత‌కుముందు కూడా లోకేష్ ఇద్ద‌రు ముగ్గురు అధికారుల‌ను త‌ప్పించార‌ని స‌మాచారం. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్ డీఏ కమిష‌న‌ర్‌ గా ఉన్న నాగులాప‌ల్లి శ్రీకాంత్‌.. స్విస్ ఛాలెంజ్ విష‌యంలో కొన్ని కొర్రీల‌ను తెర‌మీద‌కి తెచ్చారు. దీంతో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అయితే, అప్ప‌టికే సీఎం చంద్ర‌బాబు దీనిని ఓన్ చేసుకున్నారు. స్విస్ ఛాలెంజ్ ప్ర‌కార‌మే నిర్మాణాలు జ‌ర‌గాల‌ని భావించారు. అయితే, శ్రీకాంత్ దీనిని విభేదిస్తున్నాడ‌ని స‌మాచారం అందుకున్న వెంట‌నే ఆయ‌న‌పై బ‌దిలీ వేటు ప‌డింది. ఉన్న‌ప‌ళాన ఆయ‌న‌ను ఆ పోస్టు నుంచి త‌ప్పించారు. వాస్త‌వానికి ఈ బ‌దిలీ జ‌రిగిన‌ప్పుడు శ్రీకాంత్ అమ‌రావ‌తిలో కూడా లేరు. రీ ట్రైనింగ్ కోసం వెళ్లారు. ఈయ‌న బ‌దిలీ వెనుక కూడా లోకేష్ ఉన్నార‌ని అప్ప‌ట్లో పెద్ద టాక్ వ‌చ్చింది. ఇలా.. లోకేష్ ప్ర‌భుత్వ విష‌యాల్లో తెర‌వెన‌క చ‌క్రం తిప్పుతున్న విష‌యం ఇప్ప‌డు మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చింది. సో.. ఇప్పుడు ఏపీ ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో చంద్ర‌బాబుక‌న్నా చిన‌బాబే ఎక్కువ ప‌వ‌ర్ ఫుల్‌ గా ఉన్నార‌న్న చ‌ర్చ‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News