బాబు వస్తే జాబు వస్తుందనేది పాత మాట. అయితే బాబు వచ్చాకా చాలా మంది తమ తమ జాబులు పోయాయని రోడ్డు ఎక్కడం మాత్రం రొటీన్ అయ్యింది. ప్రభుత్వంలోని అనేక విభాగాల్లోని కాంట్రాక్ట్ వర్కర్లను చాలా వరకూ తొలగించారు. తరచి చూస్తే అలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ల సంగతలా ఉంటే… తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కొంతమంది సైనికుల్లాంటి వాళ్ల పరిస్థితి కూడా ఇప్పుడు రోడ్డున పడ్డట్టుగా తయారైందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ భవన్ ఉద్యోగులుగా.. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన చాలామందిని తాజాగా తీసేశారని సమాచారం. తెలుగుదేశం పార్టీ చాలా ప్లాన్డ్ గా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అన్ని విధాలుగానూ తమ అనుకూల ప్రచారం కోసం అన్ని రకాలుగానూ తమ ఏర్పాట్లలో తాముంటుంది ఆ పార్టీ. ఇంటర్నెట్ తదితర మాధ్యమాల ద్వారా అయితే.. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక సైన్యాన్నే కలిగి ఉంటుంది. ఇంటర్నెట్ - ఫేస్ బుక్ ల మీద అవగాహనతో పాటు.. ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం - తమకు అనుకూలంగా సానుకూల ప్రచారం చేయగల టాలెంట్ ఉన్న యువకులను ఇందుకోసం ప్రత్యేకంగా నియమించారు.
ఇప్పుడు కాదు.. 2014 ఎన్నికలకు చాన్నాళ్ల ముందే ఇలాంటి నియామకాలు జరిగాయి, వారితో పని చేయించుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వారికి అప్పట్లో తక్కువ శాలరీలే ఆఫర్ చేశారు.. అయితే పార్టీ అధికారంలోకి వస్తే.. మిమ్మల్ని బాగా చూసుకుంటాం, అందుకోసం కష్టపడండి అని వారికి నిర్దేశం చేశారు. ఓట్లేస్తే మీకు అన్నీ చేసేస్తాం అని హామీలు ఇచ్చినట్టుగా.. ఇక్కడి ఉద్యోగులకు కూడా హామీలు ఇచ్చారు.
ఓట్లేసిన జనాలకు హామీలను నెరవేర్చడంలో మొండిచేయి చూపినట్టుగా.. ఎన్టీఆర్ భవన్ వేదికగా తెలుగుదేశం పార్టీ కోసం యువకులకు కూడా అలాంటి షాక్ నే ఇచ్చారు. ఈ టీమ్ కు చినబాబు లోకేష్ ప్రాతినిధ్యం వహించాడు. వారిని గైడ్ చేసింది, వారిలో పార్టీకి అనుకూలంగా పనిచేసే స్ఫూర్తిని నింపింది లోకేష్ బాబే. పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లను బాగా చూసుకుంటాను అని చెప్పింది కూడా ఆయనే!
ఏకంగా లోకేష్ తమతో మాట్లాడటం, హామీలు ఇవ్వడంతో ఆ యువకులంతా ఉప్పొంగిపోయారు. రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ కోసం పని చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం గడిచినా.. వాళ్లకు నామమాత్రంగా కూడా జీతాలు పెంచలేదని తెలుస్తోంది. ఐదారు వేల రూపాయల జీతాలకు వాళ్లను నియమించుకుని.. రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు పని చేయించుకుని.. పార్టీ అధికారంలోకి వస్తే మీ జీవితాలు మారిపోతాయని ఊరించి.. వాళ్లను ఆ విధంగా వాడుకుని ఊసురుమనిపించాడట లోకేష్. ఐదారు వేల జీతాలను ఏడెనిమిది వేలకు పెంచి.. దాంతోనే పండగ చేసుకొమ్మన్నాడట.
మధ్యాహ్నం పార్టీ ఆఫీసులోనే భోజనం పెడతారు.. ఆ జీతం ఇస్తాం.. ఉండే ఉండాలి లేకపోతే పోవాలి, అన్నట్టుగా మారింది ట్రీట్ మెంట్. గత్యంతరం లేని వాళ్లు అక్కడే ఉండ సాగారు. అలాంటి వాళ్లకు తాజాగా ఇచ్చిన ట్విస్టు ఏమిటంటే.. పార్టీ కార్యకలాపాలన్నీ ఏపీలోని అమరావతికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారి విషయంలో మరింత నిర్ధయగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
అతి తక్కువ శాలరీలకు పని చేస్తున్న వారిలో కొందరిని ఇంతటితో వదిలించుకోవాలని చినబాబు ఫిక్సయ్యాడట. ఇదే జీతం ఇస్తాం.. వస్తే రండి, పోతే పొండి. ఇక కొందరైతే అసలు రానక్కరే లేదు అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులూ పార్టీ మీద అభిమానంతోనో, తప్పనిసరిగానో పనిచేసిన వారికి ఇది గట్టి షాకే. మరో రకంగా ఉపయోగించుకుందాం అనుకుంటే.. ఈ ఎక్స్ పీరియన్స్ ఏ రకంగానూ ఉపయోగపడదు.. పార్టీ అధికారంలోకి వస్తే మంచి జీతాలు ఇస్తామని ఇచ్చిన హామీపై ఆశతోనే పనిచేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే సరికి.. లోకేష్ కు ఇలాంటి వారి అక్కర లేకుండా పోయింది. ప్రభుత్వ ధనంతో ప్రచారం చేసుకుంటున్నాం.. ఇక పార్టీ తరపున వీళ్లను ఎందుకు పెట్టుకోవాలనే ఆలోచనతో వీళ్లను రోడ్డున పడేసే పనికి పూనుకున్నారు. దీంతో నివ్వెర పోవడం వారి వంతు అయ్యింది.
చంద్రబాబే అనుకుంటే.. జనాలను వాడుకున్నంత సేపూ వాడుకుని విసిరేయడంలో లోకేష్ ఇంకా ఘటికుడని స్పష్టం అవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/