టీడీపీ యువ‌ నేత‌ల‌తో లోకేష్‌ కు టెన్ష‌న్‌.. డామినేట్ చేస్తార‌నేనా..!

Update: 2019-11-06 01:30 GMT
టిడిపి యువనేత చంద్రబాబు నారా లోకేష్‌ కు ఇటీవల అభద్రతా భావం ఎక్కువైందా ? తెలుగుదేశం పార్టీ కి చెందిన యువ‌నేతలు తనను ఎక్కడ డామినేట్ చేస్తారో ? అన్న సందేహం ఆయన లో కనిపిస్తోంది. పార్టీ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయా ? అంటే తెలుగుదేశం స‌ర్కిల్స్‌ లో వినపడుతున్న టాక్‌ ప్రకారం అవున నే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. పార్టీకి ప్రధాన కార్యదర్శి గా ఉన్న లోకేష్ ఇప్పుడు టిడిపి భవిష్యత్ సీఎంగా ప్రొజెక్ట్ అయ్యేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అటు చంద్ర‌ బాబు సైతం చిన‌బాబు కు ఇంకా రాజ‌కీయ పాఠాలే నేర్పేందుకు ప‌డుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

ఇక ఇప్పుడిప్పుడే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత లోకేష్ జ‌నాల్లో కి వెళుతున్నాడు. లోకేష్ కంటే కూడా పార్టీ తెలుగు యువ‌త అధ్య‌క్షుడి గా ఉన్న దేవినేని అవినాష్‌ - ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు - మ‌రో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ తో పాటు ప‌రిటాల శ్రీరామ్ లాంటి వాళ్లు మాట్లాడినా, జ‌నాల్లోకి వెళ్లినా వ‌చ్చే క్రేజ్, ప‌బ్లిసిటీ వేరుగా ఉంటోంది... ఇది వాస్త‌వం కూడా. ఇటీవ‌ల ప‌ల్నాడులో బాధితులను ప‌రామ‌ర్శించేందుకు అవినాష్ వెళితే యూత్‌ లో రెస్పాన్స్ బాగా వ‌చ్చింది. అప్పుడు లోకేష్ ఇబ్బంది ప‌డ‌డంతో అవినాష్‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్న‌ట్టు భోగ‌ట్టా.

ఇక అనంతలో లోకేష్ కంటే శ్రీరామ్‌ కే ఎక్కువుగా క్రేజ్ ఉంది. ఇక ఇటీవ‌ల శ్రీరామ్ విజ‌య‌వాడ స‌మావేశాల‌కు వ‌చ్చిన‌ప్పుడు శ్రీరామ్ లోకేష్‌ తో పోటో దిగేందుకు ప్ర‌య‌త్నించినా ప‌ట్టించుకోలేద‌ని తెలిసింది. ఇక ఇటీవ‌ల పార్టీ బ‌త‌కాలంటే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌ నాయుడికే ఏపీ టీడీపీ ప‌గ్గాలు ఇవ్వాల‌న్న డిమాండ్లు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. రామ్మోహ‌న్ నాయుడు ఎక్క‌డికి వెళ్లినా ఇదే నినాదాలు వ‌స్తుండ‌డంతో లోకేష్ రామ్మోహ‌న్ విష‌యంలో బాగా టెన్ష‌న్‌తో ఉంటున్నాడ‌ట‌.

ఇక లోకేష్‌లా గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా విదేశాల్లో చ‌దువుకుని వ‌చ్చినా లోకేష్‌లా త‌డ‌బాటు ఉండ‌దు. లోకేష్ కంటే జ‌య‌దేవ్‌ కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. అందుకే జ‌య‌దేవ్‌ను కూడా ప‌ట్టించుకోని ప‌రిస్థితి ఉంద‌ట‌. అయితే జ‌య‌దేవ్ కూడా లోకేష్‌ను పార్టీ అధికారం లో ఉన్న‌ప్పుడే లైట్ తీస్కొనేవాడ‌న్న టాక్ ఉంది. ఏదేమైనా పార్టీలో ఉన్న యువ‌నేత‌ల జోరుతో మొత్తానికి లోకేష్‌ కు ఎక్క‌డా లేని టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇదంతా టీడీపీ వ‌ర్గాలు చెపుతోన్న మాటే సుమా..!
Tags:    

Similar News