ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామం.. విపక్ష నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు.. ఇప్పుడు ఏపీలోనే కాదు తెలంగాణలోనూ పెద్ద ఎత్తున చర్చగా మారింది. చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి దారుణ రీతిలో వైసీపీ నేతలు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన వైనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మాత్రమే కాదు.. బీజేపీతో పాటు తెలంగాణ అధికారపక్షానికి చెందిన టీఆర్ఎస్ తో పాటు..కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం మండిపడుతున్నారు. ఈ తీరు క్షమించలేనిదిగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతంలోఎప్పుడూ లేని రీతిలో చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలకు నందమూరి కుటుంబం విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని.. ఆక్రోశాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు సోదరుడి కుమారుడు కమ్ సినీ హీరో నారా రోహిత్ ఇప్పటికే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని ఆయన.. తాజాగా సరికొత్త నిరసనను చేపట్టారు.
తమ పెద్దమ్మను అలాంటి మాటలు అనటానికి నోరెలా వచ్చిందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో టీడీపీ అధినేత చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా బాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి నందమూరి కుటుంబం ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదన్న రోహిత్.. సేవా కార్యక్రమాల్ని మాత్రమే చేపట్టే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడతారా? అని ఫైర్ అయ్యారు.
అలాంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపటానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో తనకు అర్థం కాలేదన్న నారారోహిత్.. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడితే సహించేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తే.. నారా భువనేశ్వరిపై వైసీపీనేతలు చేసిన వ్యాఖ్యల ప్రభావం మరికొంతకాలం కంటిన్యూ అయ్యేలా ఉందని చెప్పక తప్పదు.