వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీగా ఇస్తారు. అయితే.. ఎంపీగా వెళ్లాలా? లేక.. ఎమ్మెల్యేగా వెళ్లాలా? ఏ టికెట్ అడగాలి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు.. దివంగత మాజీ ఎంపీ.. నారిమిల్లి శివప్రసాద్ అల్లుడు.. పంతగాని నరసింహప్రసాద్ ను వెంటాడుతున్న ప్రశ్న. దీనికి కారణం.. పార్టీ అధినేత చంద్ర బాబు.. చిత్తురు ఎంపీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించడమే! దీంతో నరసింహ ప్రసాద్.. ప్రజలను కలుస్తున్నారు.
వివిధ రూపాల్లో ఆయన ప్రజలకు చేరువ అయి.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వారికి వివరిస్తున్నారు. దీంతో నరసింహ ప్రసాద్‌కు పార్టీలోను.. అధినేత దగ్గర కూడా మంచి మార్కులే పడుతున్నాయి. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఆయన ఆవేదన చెందుతున్నారు.
పోయి పోయిఎంపీ టికెట్ ఇస్తే.. తనకు ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఎందుకంటే.. ఆర్థికంగా తనదగ్గర అంత సీన్ లేదని.. ఆయన వాపోతున్నారు. ఒక వైపు వైసీపీలో హేహాహేమీలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు.
ఎంపీ రెడ్డప్పను ఢీ కొట్టాలంటే.. అంత ఈజీకాదు. సో.. తనకు ఎంపీ సీటు వద్దన్నది నరసింహ ప్రసాద్ వాదన. అదేసమయంలో ఆయన మళ్లీ రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు. అది కూడా ఇప్పుడే ప్రకటించాలనేది ఆయన డిమాండ్. ముందుగానే ఇక్కడ ప్రకటిస్తే.. తాను ప్రచారం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. గత ఎన్నికల్లో చివరి నిముషంలో ప్రకటించడంతో తీవ్రంగా నష్టపోయానని ఆయన అంటున్నారు.
కానీ, ప్రస్తుతం చంద్రబాబు వ్యూహం మాత్రం చిత్తూరు ఎంపీ టికెట్‌ను నరసింహ ప్రసాద్‌కు ఇవ్వడం ద్వారా.. దివంగత శివప్రసాద్ సానుభూతిని సొంతం చేసుకునేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు. తద్వారా ప్రసాద్ సునాయాసంగా గెలుస్తారని బాబు భావిస్తున్నారు.
కానీ, అంత పెద్ద నియోజకవర్గంలో తాను ఖర్చు పెట్టి.. బలమైన వైసీపీ నేతలను ఢీ కొట్టే సాహసం చేయలేనని.. ప్రసాద్ చెబుతున్నారు. దీంతో సహజంగానేఅధిష్టానాన్ని ఆయన ప్లీజ్.. ప్లీజ్.. అంటూ విన్నవిస్తున్నారు. కానీ, బాబు మాత్రం ఏదీ తేల్చడం లేదు. దీంతోనరసింహ ప్రసాద్ అన్యమనస్కంగానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.