సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోమారు నోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరును తప్పుపట్టారు. స్టార్టప్ ఇండియా- స్టాండప్ ఇండియా అనే మోడీ కల ఇపుడు నెరవేరిందని ఎద్దేవా చేశారు. భారతదేశ అభివృద్ధికి పిలిచిన పిలుపు ఇప్పడు పని మాని-ఉత్పత్తులు మాని క్యూలో నిలబడాల్సిన దారుణ పరిస్థితి నెలకొందని, తద్వారా ప్రధానమంత్రి కల నెరవేరిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు దాదాపు 50 మందికి పైగా కరెన్సీ కష్టాలకు బలైపోయారు కానీ కరెన్సీ టన్నుల కొద్ది ఉన్న మహారాజులెవరూ చావలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. " బళ్ళారి మైన్స్ మాఫియా కింగ్" కుమార్తె పెండ్లి బెంగుళూరు - బళ్ళారిలో 17 కోట్ల పట్టుచీర - 90 కోట్ల విలువైన బంగారు నగలు దరించిన వధువు కళకళలాడుతుండగా 50 వేల మందికి భోజనం 500 కోట్ల రూపాయలతో పెండ్లి ఘనంగా జరిగిందని నారాయణ గుర్తుచేశారు. అదే సమయంలో దేశంలోని వేలాది మధ్య తరగతి ఇళ్లలో పెళ్లి బాజాలు నిలిచిపోయాయని విశ్లేషించారు. దాన్ని బట్టి ప్రధాని సర్టికల్ దాడి ఎవరిపైన జరిగిందని నారాయణ ప్రశ్నించారు.
కరెన్సీ నోట్లపై I Promise to pay` అని హామీ ఉన్న కరెన్సీని చిత్తు కాగితంతో పోల్చిన ప్రధాని చట్ట ప్రకారం శిక్షారుడని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా కోర్టులలో ఉరి వేసేంత శిక్షారుడని నిప్పులు చెరిగారు. " ఉరి " అనే పదం వాడవద్దంటారని మరి సాక్షాత్తు మోడీగారే నన్ను చంపేస్తారు అయినా సిద్ధం " అని భావోద్వేగంతో ప్రకటించి ప్రజాస్వామ్య గళంపై Beat below the belt అనే రీతిలో ఇరుకున పడేశారని నారాయణ పోల్చారు. స్విస్, పనామా తదితర దేశాలలో దాచుకున్న బ్లాక్ మనీతో పోలిస్తే ఇప్పడు గంభీరంగా చేసిన ప్రధానమంత్రి మోడీ ప్రకటన ద్వారా వెలుగులోకి వచ్చే బ్లాక్ మనీ చాలా తక్కువ అని నారాయణ అభివర్ణించారు. అంటే కోట్లాది ప్రజలను మానసికంగా హింసించి సాధించేది గొరంత మాత్రమే, కొండంత కోటీశ్వరులకు ఊడిగం చేసే గంభీర ప్రకటన ఎవ్వరిని మోసం చేయడానికి అని నిలదీశారు. దేశం మొత్తంగా బ్యాంకులలో దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల రైతుల రుణాలుంటాయని, దానిని రద్దు చేస్తే కొంపలు మునుగుతాయా? అని నారాయణ సూటిగా ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పలు ఎగొట్టి - టాక్స్ లు కట్టకుండా - రాయితీలు పొందే కార్పోరేటు రంగాలపై కనికరం చూపుతారా? అంటూ ప్రశ్నించారు. ఇక్కడే బ్లాక్ మనీ పేరుకు పోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ఈ ప్రకటన విడుదల చేశారనడంలో నిజం లేదని నారాయణ అన్నారు. ఆర్ బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు తెలియకుండా ఈ ప్రకటన జరగదని చెప్పారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా " గుజరాత్ పెట్రోలియం మరియు కెమికల్ కార్పోరేషన్" ఏర్పాటు చేసినప్పుడు పటేల్ అందులో కీలక పాత్ర వహించారని చెప్పారు. ఆనాడు 21 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ గ్యాస్ నిల్వలున్నట్లు అట్టహసంగా ప్రకటించడమే కాకుండా ఆ స్థాయిలో నిధులు సేకరణ కూడా జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికలలో మోడీ గెలుపునకు ఆ నిధులు మళ్ళీంపు జరిగిందనే ప్రచారం ఉందని నారాయణ ఆరోపించారు.
నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజా సంక్షేమం కోణంలో తీసుకొని ఉండాల్సిందని నారాయణ అభిప్రాయపడ్డారు. కొత్త కరెన్సీకి అనుగుణంగా సాఫ్ట్ వేర్ టెక్నాలజీలో ఏటీఎంలు అనుసంధానం చేయాల్సిందని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రత్నామ్నాయ సౌకర్యాలు ప్రజలకు కల్పించకుండా ప్లాస్టిక్ పేపర్లోనే లావాదేవీలనే పిలుపును, లంకించుకోవడం మంచిపని కాదని విశ్లేషించారు. " అన్న ప్రాసం రోజు ఆవకాయ" ఇచ్చినట్లు ఈ నిర్ణయం ఉందని నారాయణ ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/