వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం సీపీఐ సీనియర్ నేత నారాయణకు కొత్తేమీ కాదు. అవతలి వాళ్ల స్థాయి చూడకుండా ఆయన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసేస్తుంటారు. ముఖ్యమంత్రుల మీద కూడా అలాంటి వ్యాఖ్యలే చేసిన చరిత్ర ఆయనకు ఉంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఇలాగే రెచ్చిపోయి మాట్లాడేశారు ఈ మధ్య. ఐతే విమర్శ ఎంత తీవ్రమైంది అయినా అది నిర్మాణాత్మకంగా ఉంటే ఓకే.
కానీ అసలు చిరుకు సంబంధం లేని విషయంలో అకారణంగా ఆయన్ని చిల్లర బేరగాడు అంటూ దూషించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నారాయణ ఇంత కాలం ఎవరి గురించి ఏం మాట్లాడినా చెల్లిపోయింది కానీ.. ఈసారి అలా కాలేదు. గతంలో ఎలాంటి విమర్శలకూ ఆయన పెద్దగా వివరణ ఇచ్చుకుంది లేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ మీడియా సమావేశం పెట్టి తప్పయిపోయిందని లెంపలేసుకున్నారు.
ఈ సందర్భంగా నారాయణ హావభావాలు.. మీకో దండం అంటూ వ్యాఖ్యానించిన తీరు.. చూస్తే ఎందుకీ మాట మాట్లాడాంరా దేవుడా అని ఫీలవుతున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో ఆయన కాపు సంఘాల మహానుభావులు అంటూ ఒక పదం కూడా వాడారు.
దీని వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంది. చిరంజీవి మీద ఒక కుల ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నించారు. నారాయణ అలా ముద్ర వేయడం వల్ల ఇప్పుడు చిరుకు జరిగే నష్టం ఏమీ లేకపోవచ్చు.
అదే సమయంలో చిరును, పవన్ కళ్యాణ్‌ను కాపు కులస్థులు, నేతలు మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు ఓన్ చేసుకుంటున్న విషయం వాస్తవం. చిరంజీవి విషయంలో వాళ్లు స్పందించిన తీరు అలా ఉంది. రెండు రోజులుగా ఆఫ్ లైన్, ఆన్ లైన్లో నారాయణ మీద చిరు అభిమానులతో పాటు కాపు కులస్థులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నారాయణ అసలు బయట తిరగలేని స్థాయిలో ఆయన మీద దండెత్తారు. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు, మెగా ఫ్యామిలీకి మద్దతుగా కాపు కులస్థులు ఒక్కటవుతున్నారనే చర్చ కూడా నడుస్తుండడం గమనార్హం.