నారాయ‌ణ వ‌ర్సెస్ 2014 ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌!!

Update: 2022-05-11 07:31 GMT
మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయ‌డం, దీనికి ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఉదంతాన్ని సాకుగా చూపించ‌డం తెలిసిందే. అయితే.. నారాయ‌ణ అరెస్టు వెనుక‌.. ఇది ఒక్క‌టే కార‌ణం ఉందా?  ఆయ‌న‌ను బ‌ద్నాం చేయాల‌నే విష‌యం వెనుక‌.. మ‌రో రీజ‌న్ ఉందా?? అంటే.. మ‌రో కార్యాకార‌ణ సంబంధం ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జ‌రిగిన నారాయ‌ణ అరెస్టుకు.. అప్పుడెప్పుడో జ‌రిగిన 2014 ఎన్నిక‌ల‌కు మ‌ధ్య సంబంధం ఉంద‌ని చెబుతున్నారు. ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఆస‌క్తిగా ఉన్న ఈ విష‌యాన్ని మీరూ చూడండి!

ఇప్పుడు నారాయ‌ణ అరెస్టును తీసుకుంటే.. ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లో అరెస్టు చేసి చిత్తూరుకు త‌ర‌లించారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీకి సంబంధించి.. నారాయ‌ణ ప్ర‌మేయం ఉంద‌ని.. ఆయ‌న స్కూల్‌కే చెందిన డీన్‌, స‌హా ప్రిన్సిపాల్ ఒక‌రు చెప్పార‌ని.. పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి త‌మ ద‌గ్గ‌ర కొన్ని ఆధారాలు ఉన్నాయ‌ని కూడా చెప్పారు. నారాయ‌ణ స్కూల్లో ప‌నిచేసే వ్య‌క్తి ఇచ్చిన వాంగ్మూల్ మేర‌కు.. నారాయ‌ణ‌ను హ‌డావుడిగా అరెస్టు చేశారు.

అరెస్టు అనంత‌రం.. నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నారాయ‌ణ‌ను చిత్తూరు త‌ర‌లించ‌డం.. అర్ధ‌రాత్రి వేళ కోర్టులో ప్ర‌వేశ పెట్ట‌డం.. తెల్ల‌వారు జాము వ‌ర‌కు వాద‌న‌లు సాగ‌డం.. చివ‌ర‌కు నారాయ‌ణ ప్ర‌మేయం లేద‌ని... కోర్టు తేల్చేయ‌డం.. ఆ వెంట‌నే బెయిల్ ఇవ్వ‌డం..వ‌రుస‌గా జ‌రిగిపోయాయి. ఇక‌, అప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నాయ‌కులు ఈ విష‌యంపై హడావుడి చేశారు. నారాయ‌ణ అరెస్టు స‌క్ర‌మ‌మేన‌ని.. అన్నారు. అయితే.. టీడీపీ అధినేత‌, చంద్ర‌బాబు, ఆయ‌న‌కుమారుడు లోకేష్‌లు మాత్రం ఈ అరెస్టును ఖండించారు.

చంద్ర‌బాబు నిన‌న్న రాత్రి వ‌ర‌కు చిత్తూరు నాయ‌కుల‌తో మాట్లాడి.. లాయ‌ర్ల‌ను ఏర్పాటు చేసి.. ఇలా.. హైద‌రాబాద్‌లో ఉన్నాప... ప్ర‌తి విష‌యాన్ని ఆయ‌న తెలుసుకున్నారు. చివ‌ర‌కు బెయిల్ రావ‌డంతో చంద్ర‌బాబు ఊపిరి పీల్చుకుని.. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరారు.  

ఇదిలావుంటే.. రాజ‌కీయ విశ్లేష‌కులు.. ఏమంటున్నారంటే.. నారాయ‌ణ అరెస్టు వెనుక .. పెద్ద బ్యాక్ గ్రౌండే న‌డిచింద‌ని.. దీనికి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు.. సంబంధం ఉంద‌ని.. వారు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి నారాయ‌ణ పెట్టుబ‌డి పెట్టే అవ‌కాశం ఉంద‌ని.. అత‌ని వ‌ల్ల ఏపీలో వైసీపీ న‌ష్ట‌పోతుంద‌ని... అందుకే.. రాజ‌కీయంగా.. నారాయ‌ణ‌ను దూరంగా ఉంచాల‌నే ఉద్దేశంతోనే ఈ అరెస్టు జ‌రిగింద‌ని.. చెబుతున్నారు.  అంటే.. ఇలాంటి అరెస్టులు చేస్తే.. నారాయ‌ణ‌రాజ‌కీయాలు ఎందుకురా! దేవుడా! అనుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. భావించారు.

ఇక‌, గ‌త 2014 ఎన్నిక‌ల‌ను చూస్తే.. నారాయ‌ణ టీడీపీ మంత్రం ప‌నిచేసింది. అప్ప‌ట్లో ఆయ‌న చంద్ర‌బాబు చేసిన వ‌స్తున్న మీకోసం .. పాద‌యాత్ర‌కు నిధులు స‌మ‌కూర్చిన విష‌యం తెలిసిందే. అదేస‌మయంలో ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ నేత‌లు.. ప్ర‌జ‌ల‌కు ఓటుకు రూ.500 పంచితే...నారాయ‌ణ వ‌ర్గం.. రూ.300 చొప్పున  ప్ర‌జ‌ల‌కు ఇచ్చింది. ముందుగాజిల్లాల‌ను ఎంపిక చేసుకుని.. అక్క‌డ నారాయ‌ణ టీంగ‌ట్టిగా ప‌నిచేసింద‌ని అంటున్నారు.

ఎమ్మెల్యే అభ్య‌ర్థికి సంబంధం లేకుండా.. నారాయ‌ణ టీం.. ఓట‌ర్ల‌కు మూడు వంద‌లు పంపించింది. దీం తో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖ‌.. ఇలా మూడు జిల్లాలలో నారాయ‌ణ ప్లాన్ ప‌నిచేసింద‌ని అంటున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే నారాయ‌ణ‌కు చంద్ర‌బాబు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి.. మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. త‌ర్వాత‌.. ఆయ‌న‌ను కీల‌క‌మైన సీఆర్ డీఏ ను కూడా అప్ప‌గించారు.

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీకి నారాయ‌ణ ప‌నిచేస్తే వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిలో ప‌డుతుంద‌ని.. ఆ పార్టీ నాయ‌కులు ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే.. నారాయ‌ణ‌ను టీడీపీకి దూరం చేయాల‌నే ప్లాన్ వైసీపీ చేసింద‌ని.. అంటున్నారు. ఇదంతా.. పైకి ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీక్ అనే మాట వినిపిస్తున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం .. టీడీపీకి ఆయ‌న‌ను దూరం చేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News