కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు రాత్రి అరుదైన సీన్ ఒకటి చోటు చేసుకోనుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ అదేమంటే.. భారత ప్రధాని.. పాకిస్థాన్ ప్రధాని ఇద్దరు వరుసగా ఐక్యరాజ్య సమితి వేదిక మీద మాట్లాడనున్నారు. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడో స్పీకర్ గా మాట్లాడనున్నారు. ఆయన తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు.
సాధారణంగా రెండు దాయాది దేశాలకు చెందిన వారు వరుసగా ప్రసంగాలు చేయటం చాలా అరుదు. అయితే.. ఈ రోజు రాత్రి ఇది చోటుచేసుకోనుంది. న్యూయార్క్ కాలమానం ప్రకారం ఈ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అదే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటలకు షురూ కానుంది.అయితే.. మోడీ ప్రసంగం పూర్తి కావటానికి రాత్రి తొమ్మిది గంటలవుతుందని చెబుతున్నారు. మోడీ తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్నారు. ఈ రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు.
ఆయన ప్రసంగాన్ని డీడీతో సహా అన్ని ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేయనున్నాయి. అనంతరం ఇమ్రాన్ ప్రసంగాన్ని పీటీవీతో పాటు పాక్ లోని ప్రముఖ ఛానళ్లు అన్ని లైవ్ ఇవ్వనున్నాయి. కశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యం అంశాన్ని ఇమ్రాన్ హైలెట్ చేస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ అక్రమిత కశ్మీర్ పై బలమైన వాదనను వినిపిస్తున్న మోడీ సర్కారు.. ఈ వేదిక మీద నుంచి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చే వీలుందని చెబుతున్నారు.
అంతేకాదు.. పాక్ కు కూడా కాస్తంత ఘాటుగా మోడీ సందేశం ఉంటుందంటున్నారు. కశ్మీర్ మీద పాక్ తీరును గతంలో ప్రధానులు తప్పు పట్టినా.. తాజాగా మోడీ స్పందన వేరుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ సమావేశంలో దాయాదులైన ఇద్దరు దేశాధినేతలు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగించటం చాలా అరుదుగా జరుగుతుందని చెబుుతన్నారు. ఇలాంటి అరుదైన సీన్ ను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులే కాదు.. పలువురు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పక తప్పదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ సైతం భారత్ మీద.. అందునా మోడీ సర్కారుపైనా ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.