మోడీ... యోగీ...మధ్యలో యూపీ... ?

Update: 2022-01-18 12:31 GMT
అతిరధులు మహారధులు కలిస్తేనే తప్ప కురుక్షేత్ర యుద్ధంలో ఒక పక్షానికి విజయం దక్కలేదు. ఇక ఎన్నిక అంటే యుద్ధమే. ప్రతీ ఎలక్షన్ కూడా అగ్ని పరీక్షగానే పార్టీలకు  ఉంటుంది. బీజేపీకి అతి ముఖ్యమైన రాష్ట్రంగా  ఉన్న యూపీలో చూసుకుంటే ఇపుడు ఆ పార్టీకి హై బీపీ వస్తోంది. యోగీ సర్కార్ మీద  ప్రజా వ్యతిరేకత గట్టిగా ఉంది అని  అంటున్నారు. మరో వైపు వీటికి తోడు అన్నట్లుగా బీజేపీ అగ్ర నేతల మధ్యనే తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని ప్రచారం కూడా సాగుతోంది.

యూపీలో యోగీ ఆదిత్యనాధ్ ఒంటరిగా దూకుడుగా వెళ్తున్నారా అన్న డౌట్లు కూడా అందరిలో కలుగుతున్నాయట. అయితే ఆయన వెనకాల ఆరెస్సెస్ ఉందని చెబుతున్నారు. యోగీని భావి భారత నాయకుడిగా తీర్చిదిద్దాలని అరెస్సెస్ భావిస్తోంది. ఒకనాడు మోడీ వెనకాల నిలిచిన ఆరెస్సెస్ ఇపుడు యోగీకి అండగా ఉంటోంది. దీంతో మోడీని సైతం పట్టించుకోకుండా యోగీ దూకుడుగా సాగుతున్నారని అంటున్నారు.

నిజానికి యూపీకి ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ యోగీ మోడీకి అనుచరుడుగా ఉండేవారు. ఆయన‌తో పాటు అమిత్ షాకు వీర విధేయుడిగా ఉండేవారు. ఎపుడైతే ఆయన యూపీ వంటి అతి పెద్ద రాష్ట్రానికి సీఎం అయ్యారో నాటి నుంచి ఆయన రూటే మార్చేశారు అని కేంద్ర పెద్దలు అనుమానిస్తున్నారుట. యూపీలో యోగీ పాలన మీద అసంతృప్తి పెరుగుతోంది అన్న దాని మీద తన సొంత మనిషి అయిన శర్మను మోడీ యూపీకి పంపించి క్యాబినేట్లో తీసుకోవాలని కోరారట.

దాన్ని పక్కన పెట్టేసిన యోగీ శర్మను కేవలం బీజేపీ ఉపాధ్యక్షుడిగానే నియమించారు. ఇలా ఎన్నికలకు రెండేళ్ళ ముందు నుంచే మోడీ షాలతో యోగీ విభేదిస్తూ వస్తున్నారు అంటున్నారు. మరో వైపు యోగీ విపరీత వైఖరిని చూసిన మోడీ షాలు ఆయన్ని ఒక దశలో తప్పించేసి కొత్త ముఖ్యమంత్రిని తీసుకురావాల‌ని కూడా అనుకున్నారుట. అయితే ఆరెస్సెస్ మధ్యలో అడ్డుపడడంతో అది కాస్తా ఆగిందని చెబుతున్నారు.

మొత్తానికి చూస్తూంటే తానే ప్రజాకర్షణ కలిగిన నాయకుడిని అని యోగీ గట్టిగా నమ్ముతున్నారు. అదే టైమ్ లో తాను ఎవరి అదుపు ఆజ్ఞలలో ఉండాల్సిన పనే లేదన్న వైఖరితో వెళ్తున్నారుట. తనకు ఆరెస్సెస్ అండగా ఉందన్న ధీమాయే యోగీని అలా నడిపిస్తోంది అంటున్నారు. రెండవ సారి కనుక యోగీ చీఫ్ మినిస్టర్ అయితే మాత్రం బీజేపీలో చాలా మార్పులు వస్తాయని అంటున్నారు. ఆయన క‌చ్చితంగా దేశ ప్రధాని రేసులోకి వస్తారని కూడా భావిస్తున్నారు. ఎటూ ఆరెస్సెస్ మద్దతు పుష్కలంగా ఉన్న యోగీకి అది కష్టం కాబోదని కూడా అంటున్నారు.

ఇవన్నీ సరే  కానీ ఇంతకీ మోడీ యోగీల మధ్య వచ్చిన గ్యాప్ తో యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేనా అన్నదే కమలనాధులకు పట్టుకున్న కలవరమట. అయితే గెలుపు తన ఖాతాలో వేసుకోవడానికి యోగీ ఆపోసోపాలు పడుతూంటే ఓటమి వస్తే దాన్ని కూదా  ఆయనకే అంటించేయడానికి కమలం పార్టీలో పెద్దలు కధ మొదలెట్టారని అంటున్నారు. చూడాలి మరి మధ్యలో యూపీలో బీజేపీకి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News