వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.. బాధనిపిస్తుంది"... అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా.. "జరిగిన ఘటన చాలా చాలా దురదృష్టకరం.. అదొక ప్రమాదం.. ఇందులో ఎవరి తప్పూ లేదు.. ఆ ఫ్యామిలీకి జరిగింది చాలా దురదృష్టం.. దీనికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను..
శనివారం తెలంగాణ అసెంబ్లీలో "పుష్ప-2" సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోపక్క మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదని అన్నారు! ఇలా శనివారం మొత్తం తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహారంపై పలు సంచలన అంశాలు తెరపైకి వచ్చాయి!
మరోపక్క గాయపడిన బాలుడిని కాకుండా... అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అతని ఇంటి వద్ద సినిమా ప్రముఖులు క్యూలు కట్టారని.. అతనికి ఏమైనా కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా, ఏమి పోయిందా అంటూ రేవంత్ మండిపడ్డారు. ఈ కీలక పరిణామా నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకు వచ్చారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును.. శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపైనా, అల్లు అర్జున్ వ్యవహారశైలి పైనా తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్... కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. "జరిగిన ఘటన చాలా చాలా దురదృష్టకరం.. అదొక ప్రమాదం.. ఇందులో ఎవరి తప్పూ లేదు.. ఆ ఫ్యామిలీకి జరిగింది చాలా దురదృష్టం.. దీనికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.. థియేటర్ కి వచ్చిన అందరినీ నవ్వుతూ పంపించాలనేది నా ఇంటెన్షన్.. అలాంటి థియేటర్ లో ప్రమాదం జరిగితే నా కంటే బాధపడేవారు ఉంటారా ఎవరైనా?"
"శ్రీతేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితిపై గంట గంటకూ అప్ డేట్స్ కనుక్కుంటున్నాను.. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని తెలుస్తుంది.. ఇన్ని దురదృష్టకర సంఘటనల్లో అదొక్కటీ కాస్త మంచి విషయం!"
"నేను ఎవరినీ కించపరచడం లేదు.. అది డిపార్ట్మెంట్ అయినా, రాజకీయ నాయకుడు అయినా.. పైగా థియేటర్స్ కి స్పెషల్ ప్రైజ్ ఇచ్చిన ఈ ప్రభుత్వంతో మేము సంతోషంగా ఉన్నాము.. నేను ఇలా అన్నాను, అలా అన్నాను అని మిస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.. దీంతో నేను తీవ్ర అవమానకరంగా భావిస్తున్నాను!"
"నన్ను 20 ఏళ్లుగా చూస్తున్నారు కదా.. నేను అలా అంటానా? చాలా తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం జరుగుతుంది.. నా వ్యక్తిత్వ హనానానికి పాల్పడుతున్నారు. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి.. ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి, అన్ని ఫంక్షన్లూ క్యాన్సిల్ చేసుకుని.. 15 రోజులుగా ఆఫీసుకు కూడా వెళ్లలేకపోతున్నాను!"
"ఈ పరిస్థితుల్లో మీరు ఇలా అన్నారంట.. అలా అన్నారంట.. కాళ్లూ చేతులూ విరిగిపోయినా పర్లేదన్నారంట.. అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు ఎంత బాదనిపిస్తుంది? ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి అంటున్నది కాదు.. నా గురించి జరుగుతున్న ప్రచారం గురించి ప్రజలకు చెప్పాలని మాత్రమే చెబుతున్నాను!"
"నేను గత 20 ఏళ్లుగా ఎన్నో సార్లు ఆ థియేటర్ కు వెళ్తున్నాను.. ఈసారి నేనేదో బాధ్యతా రాహిత్యంగా వెళ్లాలని.. అనుమతి లేకుండా వెళ్లాలని చెబుతున్నవన్నీ తప్పుడు సమాచారాలు. నిజంగా అనుమతి లేకపోతే ఆ విషయం నాకు చెప్తారు.. నేను వెంటనే వెనక్కి వెళ్లిపోతాను.. వాళ్లే వే క్లియర్ చేస్తుంటే.. పర్మిషన్ ఉంది అనుకునే కదా ముందుకు వెళ్తుంటా.. ఈసారీ అలాగే అనుకున్నాను!"
"అదసలు రోడ్ షోనే కాదు.. థియేటర్ కు తనకూ కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది.. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వారందరికీ కనిపించాను.. వాళ్లకు కావాల్సింది కూడా అంతే.. అది కూడా ఇవ్వలేకపోతే అది ఎంతో యారిగెంట్ లా ఉంటుంది! ఇక్కడ రోడ్ షో ఎక్కడా లేదు.. జరుగుతున్నది తప్పుడు ప్రచారం!"
"ఇక థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడూ తనను ఏ పోలీసూ కలవలేదు.. నాకు ఏమీ చెప్పలేదు. కొంచెం సేపటి తర్వాత మావాళ్లు వచ్చి.. బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, దయచేసి వెళ్లిపోండి అని చెప్పారు.. దీంతో.. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి తాను, తన భార్య అంతా వెళ్లిపోయాం!"
"ఆ తర్వాత రోజు ఓ మహిళ చనిపోయిందంట.. ఓ బాబు హాస్పటల్ ఉన్నాడంట అని నాకు తెలిసింది.. థియేటర్ లో నా కొడుకు, నా కూతురూ నా పక్కనే ఉన్నారు.. అక్కడ అప్పుడు ఏమి జరిగిందో నాకు తెలియదు.. అలాంటిది నాకు తెలిసి కూడా సినిమా చూస్తూ ఉన్నానంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే చాలా బాద అనిపిస్తుంది!"
"విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసు అక్కడకు వెళ్లాడు.. హాస్పటల్ వద్దను నేను వస్తాను అంటే.. వద్దు అని వారించాడు.. మీరు హాస్పటల్ దగ్గరకు వస్తే మరళా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు.. తర్వాత కేసు ఫైల్ చేసినట్లు చెప్పాడు.. ఆ సమయంలో నేను హాస్పటల్ వద్దకు వెళ్లడం సరైంది కాదని నా లీగల్ టీం చెప్పారు."
"చిరంజీవి గారి అభిమానులు.. పవన్ గారి అభిమానులు ఫ్యాన్స్.. ఎవరినో కలవాలంటేనో.. ఇక్కడ నుంచి వైజాగ్, విజయవాడ, ఉప్పల్ వెళ్లి కలిసి వస్తాను.. అలాంటిది నా సొంత అభిమానులు, నేనున్న ప్రిమిసెస్ లో అలా జరిగితే వాళ్లను కలవాలని నాకు ఉండదా? అది మినిమం కదా?"
"ఆ తర్వాత రోజు నేను ఓ వీడియో పెట్టాను.. అది డబ్బు కోసం కానే కాదు.. నేను మీ కోసం ఉన్నాను అని చెప్పడం కోసమే డబ్బు ప్రస్థావన తప్ప మరొకటి కాదు. తర్వాత అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశాం. ఈ సమయంలో తన చుట్టూ ఉన్నవారిని పంపించి అప్ డేట్స్ తెచ్చుకుంటున్నాను! నేను ఆ కుటుంబాన్ని బాగా చూసుకుంటాను! ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను!"