చేసింది తప్పయితే శిక్షకు సిద్ధమంటున్న మోడీ

Update: 2016-11-13 09:27 GMT
500, 1000 నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసిన ప్రధాని మోడీ తాజాగా దానిపై స్పందించారు. నల్లధనం నిర్మూలనలో పెద్దనోట్ల ర‌ద్దు నిర్ణయం ఎంతో ముఖ్యమైన‌ద‌ని ప్రధాని అన్నారు. ఈ రోజు గోవాలో నిర్వహించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ... త‌న‌కు ప్రజ‌లు అవినీతిని అంతం చేసేందుకే అధికారం అప్పజెప్పార‌ని, మ‌రి దాన్ని అంతం చేయ‌కుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చూస్తుంటే త‌న‌కు కూడా బాధ వేస్తోంద‌ని, తాను ఏదైనా తప్పు చేసివుంటే ఏ శిక్షకైనా సిద్ధమ‌ని పేర్కొన్నారు.

తాము తీసుకున్న పెద్ద నోట్లు ర‌ద్దు నిర్ణయంతో 50 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయ‌ని చెప్పారు. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. మొత్తం వ్యవస్థను చక్కదిద్దడానికి కొంత సమయం పడుతుందని.. ఆలోగా కొద్దికాలం ఇబ్బందులు తప్పవని మోడీ అన్నారు.

2జీ స్కామ్‌ నిందితులు కూడా ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వ‌ద్దకు వెళ్లి క్యూలో నిల‌బ‌డుతున్నార‌ంటూ మోడీ విపక్ష నేతలపై విసుర్లు విసిరారు. న‌ల్లధ‌నాన్ని అంతం చేసే వ‌ర‌కు తాను విశ్రమించ‌న‌ని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News