ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అస్త్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వదులుతున్నారా? విపక్షాల అస్త్రంగా ఆయన ఎమోషనల్ గా టార్గెట్ చేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా మాస్టర్ స్ట్రోక్ వంటి ఇంటర్వ్యూతో మోడీ ఆయా పార్టీలను టార్గెట్ చేశారు. అధికార పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మిగిలిన ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో పత్రికకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఎన్డీయేకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని - అన్ని రికార్డులను తాము బద్ధలు కొడతామని అన్నారు.
దేశ పౌరుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ``గతంలో ఎన్డీఏకు ఎప్పుడూ రానన్ని సీట్లు ఈసారి గెలుస్తాం. గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రజలు మాతోనే ఉన్నారు. మేము దేనికీ భయపడటం లేదు`` అని మోడీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మోడీ చెప్పారు. నా నినాదం కేవలం అభివృద్ధి - వేగవంతమైన అభివృద్ధి - అందరి అభివృద్ధి.. గత నాలుగేళ్లుగా చాలా కష్టపడి పనిచేశాం. మా ట్రాక్ రికార్డు చూసి ప్రజలు మాతోనే ఉన్నారు అని మోడీ స్పష్టం చేశారు.
ఇప్పటివరకు వస్తున్న సర్వేల్లో మరోసారి మోడీయే ప్రధాని కాబోతున్నారని తేలినా.. దేశంలో మైనార్టీలు - దళితులపై జరుగుతున్న దాడులు మోడీ చరిష్మాను తగ్గించాయి. పైగా కర్ణాటకలో అధికారం చేపట్టడంలో విఫలమవడంతోపాటు ఈ మధ్య జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 1984 తర్వాత ఒకే పార్టీకి సంపూర్ణ మెజార్టీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.