తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్తు చేశారా? తెలంగాణలో తనదైన వ్యూహాలతో పార్టీని బలోపేతం చేసుకున్న కేసీఆర్...ఢిల్లీపై కన్నేసి వ్యూహాత్మకంగా చేసిన ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనను మోడీ ఆదిలోనే తుంచేశారా? పైగా...ప్రంట్ పేరుతో తనముందు పెట్టిన ఎజెండాను మోడీ పక్కనపెట్టేయించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి విషయంలో ఈ చర్చ తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన పీజే కురియన్ కు జూన్‌లో పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ పొందారు. దీంతో ఈ నెల 9న ఎన్నికలు నిర్వహించనున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ఇవాళ రాజ్యసభలో ప్రకటించారు. అయితే ఈ పదవిపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన ప్రతిపాదనలు బీజేపీ పెద్దల ముందు ఉంచితే వారు పక్కన పెట్టేశారని సమాచారం.
డిప్యూటీ చైర్మన్ పదవికి ఈ నెల 9న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించి.. డిప్యూటీ చైర్మన్ ను ఎంపిక చేయనున్నారు. అయితే రాజ్యసభలో బీజేపీకి సరిపోయినంత మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. అయితే, కాంగ్రెసేత ప్రతిపక్షాల తరఫున తమ ఎంపీ అయిన కేశవరావును నిలబెట్టాలని - ఇందుకు ఫెడరల్ ఫ్రంట్ ను అస్త్రంగా చేసుకోవాలని కేసీఆర్ భావించారు. అయితే, ఈ ప్రతిపాదన ఆదిలోనే నీరుగారింది. దీంతో బీజేపీ మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నించారని సమాచారం.
సంపద్రాయబద్దంగా అయితే లోక్ సభ స్పీకర్ - రాజ్యసభ చైర్మన్ పదవులను అధికార పక్షానికి చెందిన వ్యక్తులు - డిప్యూటీ స్పీకర్ - డిప్యూటీ చైర్మన్ పదవులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల నిర్వహిస్తారు. ఈ లాజిక్ ఆధారంగా శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశానికంటే ముందు జరిగిన భేటీలో తన కోరికను ప్రధాని మోడీ చెవిన కేసీఆర్ అందుకు తగిన హామీని పొందినట్లు తెలుస్తోంది. కానీ తాజాగా జరిగిన సమావేశంలో తాము టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేమని మోడీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో అటు కాంగ్రెసేతర విపక్షాల తరఫున అభ్యర్థిగా నిలపలేక ఇటు బీజేపీ మద్దతుతో నెగ్గించుకోలేక కేసీఆర్ డీలా పడ్డారని టాక్.