ఇవాళ నవంబరు 8. భారతదేశ ప్రజలు మరి కొన్ని సంవత్సరాల పాటూ అంత సులభంగా మరచిపోలేని రోజు. ఈ రోజుతో ఆరంభించి.. కొన్ని రోజుల పాటూ తాము ఎన్నెన్ని యాతనలు పడ్డమో - ఎంత నరకం అనుభవించామో గుర్తుచేసుకునే రోజు. అవును ఈ రోజు భారతదేశంలో మోడీ సర్కార్ నోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న రోజు. జనం ఇవాళ తమ బాధల్ని తలచుకుంటూ గడుపుతారు. అయితే మోడీ సర్కార్ మాత్రం ఈ రోజును వేడుకగా జరుపుకోవడం గురించి దృష్టి పెడుతున్నది. ఈ రోజును నల్లధనం వ్యతిరేక దినోత్సవంగా వారు నిర్వహిస్తారుట. చూడబోతే.. తాము ఇలాంటి ప్రకటన చేయడం వల్ల జనం నవ్వుకుంటారనే భయం కూడా మోడీ ప్రభుత్వానికి లేనట్టుగా ఉంది.
ఎందుకంటే కేవలం నోట్ల రద్దు వల్ల మోడీ సర్కారు సాధించినది ఏమీ లేదు. కొత్త నోట్ల ముద్రణ వల్ల అయిన వ్యయం - వాటిని పుచ్చుకోవడానికి ప్రజలు కోల్పోయిన పని - ధనం ఇవన్నీ లెక్కలు తీస్తే.. స్వదేశంలోని నల్లధనం ఎంత బయటపడిందో- అది చాలా స్వల్పంగా కనిపిస్తుంది. అయితే.. అప్పట్లో ప్రజలు తమ లక్ష్యాన్ని అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.. అనే పదాలతో.. ఆ ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా సరే.. మాటలు చెబుతూ వచ్చిన మోడీ సర్కార్.. ఇప్పుడు కూడా అదే బుకాయింపునకు పాల్పడుతోంది వేడుకలు చేసుకోవాలని అంటోంది.
గతం గత: అన్నట్లుగా జరిగిందేదో జరిగిపోయింది. ఈ నిర్ణయంతో ప్రజల జీవితాలకు మోడీ సర్కారు ఎంత చేటు చేసిందో వదిలేద్దాం. కనీసం ఈ నిర్ణయం పర్యవసానంగా అయినా కొన్ని సత్ఫలితాలు ఉన్నాయని వారు నిరూపించుకుంటే.. ప్రజల మన్నన దక్కుతుంది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురావడానికి నిర్దిష్టంగా కొన్ని చర్యలైనా తీసుకుంటే బాగుంటుంది. కేవలం మాటలు చెప్పడం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు.. మీ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తా అంటూ చప్పట్లు కొట్టించుకోవడం కాదు. కేంద్ర ప్రభుత్వానికి చేతనైతే కనీసం 15 లక్షల కోట్ల రూపాయలనైనా విదేశాల నుంచి స్వదేశానికి తీసుకురావాలి. ఈ దేశపు సకల ప్రజలయొక్క హక్కు భుక్తమైన ధనం.. అలా అక్రమంగా విదేశీ నల్ల బ్యాంకుల్లో మురిగిపోకుండా వారు చర్యలు తీసుకోవాలి.. ఆ రకంగా మోడీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.