పని చేయండి.. పదవులు పొందండి..కానీ ఆ ఒక్కటి మాత్రం ఆశించకండి అని ప్రధాని మోడీ తన పార్టీ ఎంపీలకు హితవు పలికారు. మోడీ చేసిన ఈ ప్రకటన కొత్తగా ఎన్నో ఆశలతో గెలిచిన పార్టీ ఎంపీలు - సీనియర్ నేతలకు శరాఘాతంగా మారింది.
ఎన్టీఏ పార్టీల భాగస్వామ్య పక్ష ఎంపీలతో మోడీ సమావేశమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ ఏర్పాటుపై మీరు కొత్త మంత్రులంతూ మీడియాలో - కొందరు పనిగట్టుకొని ఫోన్ చేసి ఎంపీలను గందరగోళానికి గురిచేస్తారని.. ఎవ్వరూ ఫోన్ చేసినా.. పీఎంవో నుంచి ఫోన్ వచ్చినా క్రాస్ చెక్ చేసుకొని నిర్ధారించుకోవాలని మోడీ హితవు పలికారు.
ఇక మోడీ ఆ ఎంపీలకు మరో చురక కూడా అంటించారు. గెలిచిన ఎంపీ లందరూ మంత్రి పదవుల కోసం పనిచేయవద్దని.. పదవులు ముఖ్యం కాదని.. ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ముఖ్యమని అన్నారు. తాను ఎంపీ నేనని.. మీతో పాటు కార్యకర్తను అని.. అందరం పార్టీ కోసం కలిసి పనిచేద్దామని అన్నారు.
ఇలా మోడీ రెండోసారి గెలవడం.. ఎక్కువ మంది ఎంపీలు మంత్రి పదవుల రేసులో ఉండడంతో ముందే వారి ముందరికాళ్లకు బంధం వేసేలా కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. ఎవ్వరూ మంత్రి పదవులపై ఆశలు పెంచుకోవద్దని.. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేయాలని మోడీ చెప్పడంతో కేంద్రంలో మంత్రి పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు షాక్ తగిలింది.