‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టే ఉందట ప్రధాని నరేంద్రమో కాన్ఫరెన్స్ ల తీరు చూస్తుంటేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒట్టి టైంపాస్ మీటింగ్ లు అంటున్నారు కొందరు మేధావులు. కరోనా దేశంలో ప్రబలుతోంది. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అయితే ఉగ్రరూపం దాలుస్తోంది. కరోనా లెక్కలు వల్లెవేయడం.. సూక్తులు చెప్పడం తప్పితే ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి భరోసాను రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ప్రబలుతున్న రాష్ట్రాలకు కరోనా కిట్స్ పంపించడం కానీ.. లాక్ డౌన్ తో కుదేలైన రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసే విషయంలో ప్రధాని నోటి వెంట ఒక్క మాట కూడా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు.
లాక్ డౌన్ మంచిదే.. దాన్ని కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. లాక్ డౌన్ వల్లే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి.అయితే దాని పర్యవసనాలను ఎదుర్కొనే విషయంలో కేంద్రం వైఖరి మాత్రం విమర్శలకు తావిస్తోందని మేధావులు అంటున్నారు. ఎందుకు లాక్ డౌన్ చేయడం అంటే కరోనాను జయించడం అనే సూక్తి చెప్పిన ప్రధాని రాష్ట్రాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు.
రాష్ట్రాలకు కరోనా కిట్స్ విషయంలో కానీ వెంటీలేటర్స్ పంపిణీ కానీ.. ఇంకా ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాలకు ఇబ్బందులు తీరుస్తానన్న మాటే ప్రధాని నోటివెంట రాకపోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్రాలకు కరోనా సహాయక సామాగ్రి పంపిణీకానీ.. ఆర్థిక పరిపుష్టి విషయంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయకుండా ఉచిత సలహాలు ఇవ్వడం రాష్ట్రాలనకు ఏమీ ఉద్దరించినట్టు కాదని మేధావులు గుర్తు చేస్తున్నారు.
ఇక లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవుల్లోనే ఉన్నారు. అత్యవసర సేవలు చేసే వారు మినహా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. వారికి ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. సగం జీతాలు ఇస్తూ కాలం వెళ్లదీసే దుర్భర పరిస్థితి ఉంది. ఇవన్నీ ప్రధాని నరేంద్రమోడీకి తెలిసినా ఎందుకు సమస్యలపై మాట్లాడడం లేదు అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బహుషా వాటి గురించి మాట్లాడితే ప్రభుత్వాలు సాయం అడుగుతామని.. అప్పుడు తీర్చాల్సి వస్తుందనే ప్రధాని మోడీ ఇలా దాటవేస్తున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ తీరు చూస్తుంటే రూపాయి విదిల్చం ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.