కావేరీ వివాదంపై మోడీ స్పందన ఇది!

Update: 2016-09-13 07:32 GMT
కర్నాటక - తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న కావేరీ జల నిప్పులు మామూలుగా లేవు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటలు జరిగిన దాఖలాలు లేవేమో. అయితే ఇప్పటికే తారాస్థాయికి చేరి కోట్ల రూపాయల ఆస్తినష్టాలకు చేరిన ఈ ఆందోళనపై బాదితులు ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో కావేరి నదీ జలాల వివాదంపై తమిళనాడు - కర్ణాటక  రాష్ట్రాల్లో జరుగుతున్న దారుణ పరిస్థితులపైనా - హింసాకాండపైనా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. ఈ మేరకు ప్రజలంతా అంతా సంయమనం పాటించాలని - సామాజిక బాధ్యతను గుర్తుపెట్టుకోని ప్రవర్తించాలని ఇరురాష్ట్రాల ప్రజలను ఆయన కోరారు.

ఇదే సమయంలో ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని, రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతగానో బాధించాయని మోడీ చెప్పారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రజలు హింసను వదిలి - జాతీయ అవసరాల కోసం నిలబడతారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అన్నింటికన్నా ప్రధానమైన పెద్దదైన విషయం దేశాన్ని నిర్మించుకోవడమే అని, అందుకోసం తమిళ - కన్నడ ప్రజలు తోడుగా నిలబడతారని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టడం - పదుల సంఖ్యలో బస్సులు కాలి బూడిదవడం - ఫలితంగా బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు కర్య్ఫూని విధించడం తెలిసిందే.
Tags:    

Similar News