అంచనాలకు భిన్నంగా భారీ మెజార్టీతో విజయం సాధించిన మోడీ.. తన మంత్రి వర్గానికి సంబంధించి ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మంత్రివర్గ కూర్పు చూస్తే..తనకు అత్యంత విధేయులు.. సన్నిహితులైన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన రాజకీయ గురువు అద్వానీ తరానికి చెందిన నేతల్లో ఇద్దరంటే ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చిన మోడీ..వివిధ రాష్ట్రాలకు చెందిన కొత్తతరం నేతల్ని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.
ఈ కూర్పుచూస్తే.. మొత్తం మోడీ మార్క్ కనిపించేలా చేశారని చెప్పాలి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి పదవులు కట్ చేసిన మోడీ.. విధేయతకు పెద్ద పీట వేశారని చెప్పాలి. అంతేకాదు.. తన మిత్రుల విషయంలోనూ మోడీ విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో బీజేపీ పాగా వేయాలని భావిస్తున్న మోడీషాలు.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కుమారుడికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని భావించినా.. అనూహ్యంగా అలాంటి పరిస్థితి చోటు చేసుకోలేదు. మొత్తం 57 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో తమ పార్టీకి అధిక్యతను కట్టబెట్టిన దాని ప్రకారం మంత్రి పదవులు ఇచ్చినట్లుగా చెప్పాలి.
ఇక.. రాష్ట్రాల వారీగా మోడీ ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తే.. ఉత్తరప్రదేశ్ కు పెద్ద పీట వేశారు. ఆ తర్వాత స్థానం మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. కర్నాటక.. బీహార్ లకు దక్కింది. మోడీ కేబినెట్ లో పన్నెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా ఉండటం ఒక విశేషమైతే.. ఉత్తరాది.. దక్షిణాది అన్న వాదన తరచూ తెర మీదకు వస్తున్న విషయాన్ని మోడీ లైట్ తీసుకున్నట్లుగా కనిపించింది.
ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వని మోడీ.. దక్షిణాది రాష్ట్రాలకు కేవలం ఆరు కేంద్రమంత్రి పదవులు..ఒక సహాయమంత్రి పదవులు ఇవ్వటం గమనార్హం. ఏ రాష్ట్రానికి ఎన్ని కేబినెట్ పదవులు.. మరెన్ని సహాయమంత్రి పదవులు ఇచ్చారన్నది చూస్తే..
రాష్ట్రం కేబినెట్ పదవి సహాయమంత్రి పదవి
అరుణాచల్ ప్రదేశ్ 1 0
తెలంగాణ 1 0
ఒడిశా 1 1
తమిళనాడు 1 0
కర్ణాటక 4 1
గోవా 1 0
మహారాష్ట్ర 4 3
గుజరాత్ 1 2
మధ్యప్రదేశ్ 4 2
రాజస్థాన్ 1 2
హరియాణా 2 0
పంజాబ్ 1 1
హిమాచల్ ప్రదేశ్ 1 0
జమ్ముకశ్మీర్ 1 0
ఉత్తరాఖండ్ 1 0
ఉత్తరప్రదేశ్ 5 5
బిహార్ 3 2
జార్ఖండ్ 1 0
ఛత్తీస్ గఢ్ 1 0
పశ్చిమబెంగాల్ 2 0
ఢిల్లీ 1 0
ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలు
+ ఆంధ్రప్రదేశ్
+ అసోం
+ కేరళ
+ మేఘాలయ
+ సిక్కిం
+ త్రిపుర
+ మణిపూర్
+ నాగాలాండ్
+ డామన్ డయ్యూ
+ అండమాన్ నికోబార్
+ పుదుచ్చేరి