1942-47లోకి వెళ్దామంటున్న మోడీ

Update: 2017-08-09 11:14 GMT
ఆగస్టు 9.. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో ప్రాధాన్యమున్న తేదీ. సరిగ్గా 75 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ‘క్విట్ ఇండియా’ పేరుతో ఓ అద్భుత పోరాటం మొదలైంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో అది కీలక మలుపు. ఈ ఉద్యమ వేడికి తాళలేకే రెండు శతాబ్దాల సుదీర్ఘ పాలనకు తెరదించుతూ ఇండియాను విడిచి వెళ్లిపోయారు బ్రిటిష్ వాళ్లు. వచ్చే ఐదేళ్ల పాటు అంటే 2017-2025 మధ్య ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని మోడీ పిలుపునిచ్చాడు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే..

‘‘క్విట్ ఇండియా లాంటి చారిత్రక ఉద్యమాల గురించి ఈ తరం యువత తెలుసుకోవాలి. అలాంటి ఉద్యమాల్ని గుర్తు తెచ్చుకుంటే దేశానికి బలం వస్తుంది. 2022 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుంది. కాబట్టి 1942 నుంచి 1947 వరకు స్వాతంత్ర్య పోరాటం ఎంత స్ఫూర్తిమంతగా సాగిందో గుర్తు తెచ్చుకుని 2017-22 మధ్య ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. అప్పుడే దేశం ఉన్నత స్థితికి చేరుకుంటుంది’’ అని మోడీ అన్నారు. స్వాతంత్ర్యం కోసం అప్పటి నాయకులు.. ప్రజలు ఎలా పోరాడారో.. దేశ ఉన్నతి కోసం ఇప్పటి నాయకులు.. ప్రజలు కూడా అలాగే పని చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని జీఎస్టీ గురించి.. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం గురించి. మహిళా సాధికారత గురించి కూడా మాట్లాడారు.
Tags:    

Similar News